Advertisement
అపర చాణక్యుడిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడి గురించి మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్య చానక్యుడు తన వ్యూహాలు, నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. చాణక్యుడు తన జీవితకాలంలో ఒక గొప్ప పుస్తకాన్ని రచించారు. కేవలం తను రాజకీయాలే కాకుండా, ఆర్థికపరమైన శాస్త్రంలో, తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించారు. తన నీతి శాస్త్రంలో పేర్కొన్న అద్భుతమైన విషయాలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Advertisement
చానక్యుడు తన నీతి శాస్త్ర గ్రంథంలో భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి కూడా పేర్కొన్నారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉన్నప్పటికీ కొందరు మహిళలు తమ భర్తల వద్ద కొన్ని విషయాలను దాచిపెడతారట. ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వివాహానికి ముందు జరిగిన పనులను రహస్యంగా ఉంచుతుంది. ఎందుకంటే అవి భర్తకు తెలిస్తే లేనిపోని అనుమానాలు వస్తాయన్న ఉద్దేశంతో పెళ్లికి ముందు జీవితం గురించి ఎట్టి పరిస్థితులలోనూ భార్య భర్తకి వాస్తవాలు తెలియని ఇవ్వదని చెప్పారు. అలాగే భర్త తీసుకునే నిర్ణయాలన్నింటికీ భార్య అంగీకరిస్తుంది. ఆ నిర్ణయాలలో కొన్ని భార్యకు నచ్చకపోయినాప్పటికీ తన మనసులోని అభిప్రాయాన్ని భర్తకు చెప్పకుండా దాచేస్తుంది.
Advertisement
అలాగే ఇంటి ఖర్చుల విషయంలో కూడా భార్య తన దగ్గర ఉన్న ఆదాయంతోనే సర్దిపెడుతుంది. ఇంకా ఎక్కువ కావాల్సి ఉన్నా అడగదు. భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు ఆ విషయం గురించి భర్త అడిగినా భార్య పెద్దగా స్పందించారట. ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇష్టపడరని చాణక్యనీతిలో పేర్కొన్నాడు. అలాగే తనకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడి దాచిపెడుతుంది. చిన్న చిన్న జబ్బులు వచ్చినా కూడా పట్టించుకోరట. డబ్బులను ఎందుకు ఖర్చు చేయడం అని అలాగే ఉండిపోతారట. అయితే అలా చేయడం వల్ల స్త్రీలు నష్టపోతున్నారు అని చాణక్యుడు తెలిపారు.