Advertisement
తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాడు ఆచార్య చాణక్యుడు. మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో చాణుక్యుడు కీలక పాత్ర పోషించాడు. ఆయన ఓ గొప్ప పండితుడు. చాణక్యుడి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య విధానాలను అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేదు. నేటికీ ఆచార్య చానక్యుడి విధానాలు ప్రభావంతంగా ఉన్నాయి. మనిషి నడవడిక పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి చాణక్యుడు. సమాజంలో మనిషి జీవించవలసిన పద్ధతిని, మనిషి నడవడిక వంటి అనేక విషయాలను వివరించారు.
Advertisement
Read also: అవకాశాల కోసం వెళ్తే..సూపర్ స్టార్ కృష్ణ ను NTR అవమానించారా ? NTR అన్న మాటలివే
Advertisement
అయితే ఆచార్య చాణక్య జీవితంలో ముఖ్యమైన భాగాల గురించి ప్రస్తావించాడు.. అదే సమయంలో జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు తనలోని కొన్ని లక్షణాలను పరీక్షించమని చెప్పాడు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మతపరమైన ధోరణులు.. ఏ వ్యక్తి అయినా ఒక పరిమితికి కట్టుబడి ఉంటారు. అయితే ముఖ్యంగా వారు అనుసరించే మతం పై వారికి ఆసక్తి ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఓ పద్ధతిని పద్ధతిగా అనుసరించే వ్యక్తి మీ జీవితంలో సంతోషాన్ని నింపడమే కాక మీ కుటుంబాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దగలుగుతుంది. ఇక ఒక వ్యక్తిలోని అందాన్ని చూసి, ఆకృతిని చూసి పెళ్లికి నిర్ణయం తీసుకోవద్దని ఆచార్య చానక్యుడు వివరించారు.
శరీర ఆకర్షణ అనేది కొన్నేళ్లు మాత్రమే. కానీ అంతర్గత అందం మీతో జీవితాంతం ఉంటుంది. అలాంటి భాగస్వామిని ఎంపిక చేసుకోగలిగితే మీ జీవితం ధన్యం. ఇక మీ భాగస్వామిలో చూడవలసిన మరొక అంశం సహనం. జీవితంలో చాలా సందర్భాలలో కొన్ని కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సినపుడు, లేదా సమస్యలను పరిష్కరించుకోవాలన్న సహనం చాలా అవసరం. ఈ లక్షణం మీ జీవిత భాగస్వామిలో ఉంటే ఎంత కష్టాన్నైనా ఎదుర్కోగలుగుతారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా మీ భుజం తట్టి మద్దతు ఇచ్చే భాగస్వామిని ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు.