Advertisement
ఆచార్య చాణిక్యుడు మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. జీవితంలో ఎలా ఉంటే ముందుకు వెళ్తామో ఆయన బోధించారు. సాధారణంగా పెద్దలనుంచి వస్తున్న కష్టేఫలి అనే సామెత మాట వినే ఉంటాం.. కష్టపడితే ఫలితం దక్కించుకోవచ్చు. అలసటగా, నీరసంగా కూర్చుంటే మనతో పాటు ఉన్న వాళ్ళు మనల్ని దాటుకొని పోతారు. కాబట్టి కష్టపడితేనే ఫలితాలు అందుతాయని చెప్తుంటారు పెద్దలు. ఈ క్రమంలో ఆచార్య చాణిక్యుడు చాలా నీతులు చెప్పాడు. దీంతో ఆయన మంచి వ్యూహకర్త ఆర్థికవేత్తగా ప్రసిద్ధి పొందాడు. ఆయన చెప్పిన నీతి సూత్రాల మూలంగా ఆయనకు కౌటిల్యుడు అనే బిరుదు వచ్చింది. అయితే మానవ జీవితంలో సంపద ఎలా పోగు చేయాలనే విషయాలను తన నీతి శాస్త్రంలో బోధించాడు. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఏయే నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
#1. అదృష్టంపై భారం వేసి :
కొంతమంది వ్యక్తులు అదృష్టం వస్తుందని, అది వచ్చినప్పుడు సంపద వస్తుందని నమ్మి దనం పోగు చేయని వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలా అదృష్టం కోసం ఎదురు చూడకుండా దానికోసం కష్టపడాలి అని చాణిక్యుడు తెలిపారు.
Advertisement
also read:తన భార్య రాక కోసం ఎదురు చూసే భర్త ! ఒక అందమైన ప్రేమ జంట కథ !
#2.పొదుపు:
ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు. కానీ పొదుపు చేయడంలోనే విఫలం అవుతూ ఉంటారు. సంపాదించిన డబ్బును ఏ విధంగా పొదుపు చేయాలో తెలిసిన వారు జీవితంలో ఎదుగుతారని ఆచార్య చాణిక్యుడు అంటున్నారు.
#3. నిజాయితీ:
ముఖ్యంగా సంపద పోగు చేసే వారికి నిజాయితీ అనేది అవసరం. నిజాయితీగా సంపాదిస్తూ ఆ డబ్బు పోగు చేస్తే జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని, వ్యాపారాలు కూడా కలిసి వస్తాయని ఆచార్య చాణిక్యుడు అంటున్నారు.
#4. కష్టపడే లక్షణం:
కష్టపడి పని చేసే వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, వీరి జీవితంలో సంపదలను సృష్టిస్తారని చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపారు. కష్టపడే గుణం ఉన్నవాళ్లు అవకాశాలు సృష్టించుకుని వాటి ద్వారా ప్రయోజనం పొందుతారని, శ్రమించే వాళ్ళకి సంపద శ్రేయస్సు సిద్ధిస్తాయని ఆచార్య చాణిక్యుడు అంటున్నారు.
also read: