Advertisement
చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను బోధించాడు. చాణక్యుడి విధానాలను తొలగించడం ద్వారా చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తి అయ్యారని అందరికీ తెలుసు. అలాగే మీరు కూడా మీ జీవితంలో చాణక్య నీతి ద్వారా విజయం సాధించవచ్చని నిపుణులు అంటున్నారు. చాణక్యుడి భోధనలు మరియు విధానాలు నేటికీ చాలామంది పాటిస్తూ ఉంటారు. చాణక్యుని బోధనలు జీవితంలో సక్సెస్ కావడానికి మరియు మంచి వ్యక్తిత్వంతో ఎదగడానికి ఎంతో ఉపయోగపడతాయి. చాణక్య నీతి ప్రకారం ఈ మూడు పరిస్థితుల్లో ఏ ఒక్కటి ఎదురైనా మనల్ని దురదృష్టం వెంటాడినట్టే అవేంటో ఒకసారి చూద్దాం..?
Advertisement
Also Read: చైతు విషయంలో నాగార్జున తప్పిదం వల్ల.. ఆ సూపర్ హిట్ సినిమా మిస్సయిందా..?
Advertisement
మోసపోయి డబ్బు పోగొట్టుకోవడం:
జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే కావలసింది డబ్బు.. మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్కోసారి మోసగాళ్ల బారినపడి పోగొట్టు కుంటాం. దీనివల్ల చాలా బాధ కలుగుతుంది. ఇది దురదృష్టానికి సంకేతంగా చెబుతారు..
వృద్ధాప్యంలో భాగస్వామి దూరమవ్వడం :
వృద్ధాప్యం లోకి వచ్చాక మన జీవిత కాలం తోడునీడగా ఉన్నా భాగస్వామి దూరం అవడం వల్ల ఒంటరిగా జీవించడం చాలా కష్టంగా మారుతుంది.
మరొకరి ఇంట్లో నివాసం ఉండడం :
అనివార్య కారణాల వల్ల మనం వేరొక ఇంట్లో నివసించాలి వస్తే, అది మన జీవితంలో దురదృష్టానికి సంకేతమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి మరొకరిపై ఆధారపడవలసి ఉంటుంది. వారి ఇష్ట ప్రకారమే మనం అక్కడ జీవించాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సూచించారు.
Also read: రైలు అగినప్పుడు ఇంజన్ ఎందుకు ఆఫ్ చేయరో మీకు తెలుసా..?