Advertisement
తెలుగు రాష్ట్రాలలో రాజకీయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారనుంది. బిజెపి కొత్త గేమ్ మొదలుపెట్టేసింది. టార్గెట్ 400 సీట్లలో భాగంగా పాత మిత్రులతో కొత్త పొత్తులకు సిద్ధమైంది అందులో భాగంగా ఏపీలో టిడిపి ఎన్డీఏ లో చేరడానికి ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయి అయితే ఈ టైంలో బీఆర్ఎస్ సైతం ఎన్డీయే చేరుతుందని ప్రచారం మొదలైంది. దీనిమీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి కేసీఆర్ బిజెపితో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీ లో ఎన్నికల పొత్తులు దాదాపు ఫిక్స్ అయిపోయాయి. ఇప్పటికి టీడీపీ, జనసేన పొత్తుఅధికారికంగా అయింది. ఎన్డీఏ లోకి తిరిగి చేరిక అంశం మీద కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబు మంతనాలు జరిపారు.
Advertisement
Advertisement
అయితే పొత్తు మీద అధికారికంగా రెండు పార్టీల నుంచి ఇప్పటికి ప్రకటన రాలేదు వచ్చే వారం ఈ పొద్దు కి సంబంధించి కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉంటుంది. ఏపీ లో ఈసారి ఎన్నికలు టీడీపీ కి కీలకంగా మారింది. జగన్ ని ఓడించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సపోర్ట్ అవసరం అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. సీట్లు దక్కని పార్టీ వాళ్లు ఇప్పటికే చంద్రబాబు బుజ్జగింపులు ప్రారంభించారు.
బీఆర్ఎస్ గా మార్చిన కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆలోచన చేశారు. బిజెపితో పొత్తు అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఒకే కూటమిలో కొనసాగే అవకాశం ఉంటుందని అంతా అంటున్నారు మరి ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారింది ఏమవుతుందనేది చూడాలి. ఒకవేళ కనుక ఇప్పుడు వినపడుతున్న విషయాలే వాస్తవాలు అయ్యాయి అంటే కచ్చితంగా ఒకే కూటమిలో కెసిఆర్ అలానే చంద్రబాబు నాయుడు కూడా ఉంటారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించలేము. అందులోని ఇప్పుడు ఏపీలో రాజకీయాలు హిట్ ఎక్కాయి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏం జరుగుతుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!