Advertisement
కోట్లాది మంది భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటి లడ్డు ప్రసాదంలో జంతువులకు కలిపారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భక్తులు మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువులకు ఉన్నట్లు ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు బయటపెట్టారు. లడ్డూలను జూలై 8, 2024 న ల్యాబ్ కి పంపించగా ఈ విషయం బయటపడింది. అయితే ఈ విషయం పై వైసీపీ నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు.
Advertisement
చంద్రబాబు హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారని అన్నారు. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీరు స్థాయిలో మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో తిరుమల పవిత్రతను కాపాడామని అన్నారు. తాను వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు చేసిన ఆరోపణలపై కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నారన్నారు.
Advertisement
Also read:
సీఎం ఆరోపణలకు కట్టుబడి ఉంటే వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా న్యాయపరంగా ముందుకు వెళ్తానని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే శాంపిల్స్ ని సేకరించారని ఇట్టే అర్థమవుతుందని వైసీపీ నేతలు చెప్పారు. జూలైలో నివేదిక వస్తే ఇప్పటిదాకా బయట పెట్టకుండా ఎందుకు దాచారని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టులో వైసీపీ నాయకులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ నిరూపణ కాకపోతే చంద్రబాబు సర్కార్ ఇరుకులో పడినట్లే.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!