Advertisement
అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు మరో శ్వేత పత్రం విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక అవకతవకలపై శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన రాష్ట్రం భారీగా అప్పులు పాలైందని చెప్పారు. గనుల దోపిడి ద్వారా రాష్ట్రానికి రూ. 9,750 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అక్రమాల వలన రాష్ట్రానికి 1.29 లక్షల కోట్ల మేర విద్యుత్ బకాయిలు పడ్డాయని అన్నారు.
Advertisement
మొత్తంగా వైసీపీ 9.74 లక్షల కోట్ల అప్పులు చేసిందని శ్వేత పత్రంలో వెల్లడించారు. వైసీపీ చేసిన అప్పుల కారణంగా రాష్ట్రంలోని ఒకరి పైన తలసరి అప్పు 1.44 లక్షలుగా ఉందని అన్నారు. వైసీపీ విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయ వనరులు తగ్గాయని అప్పులు పెరుగాయని అసెంబ్లీలో ఆయన వెల్లడించారు.
Advertisement
Also read:
Also read:
ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకువచ్చారని ఆఖరికి మద్యం అమ్మకాల పైన కూడా రాష్ట్రానికి అప్పులు తెచ్చారని ఇటువంటి ఆలోచనలు ప్రపంచంలో ఎవరికీ రావని ఎద్దేవా చేశారు. 15 ఏళ్లపాటు మద్యంపై వచ్చే ఆదాయం ఆ అప్పులు కట్టడానికే సరిపోయిందని అన్నారు. దీంతో పాటుగా ప్రతి శాఖలోని నిధుల్ని ఖాళీ చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!