Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా బహిరంగ లేఖ వ్రాసారు. తన భర్త పై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయించారని ఆమె చెప్పారు. నిస్వార్ధంగా ఎన్నో ఏళ్ల నుండి కూడా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పని చేశారని.. అటువంటి వ్యక్తిని ఇబ్బందులు పెడుతున్నారని ఆమె చెప్పారు చంద్రబాబుకి పరిస్థితులు అండగా ఉండాలని ఆమె అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనకి తెలుసు. అయితే ఈ క్రమంలోనే విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.
Advertisement
కేసులో వివరాలను తెలుసుకోవడానికి చంద్రబాబుని కస్టడీకి ఇవ్వాలన్నా వాదనతో కోర్టు ఒప్పుకుని రెండు రోజులు పాటు కస్టడీకి అనుమతించింది. చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రశ్నించబోతున్నారు. భువనేశ్వరి లేఖ రాస్తూ వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కి పాల్పడినట్లు చెప్పారు. ఇలాంటివి రాష్ట్రంలోని వ్యవస్థలకు సైతం శ్రేయస్కరం కాదని ఆమె రాశారు.
Advertisement
ప్రజల కోసం దశాబ్దాలుగా నిద్రాహారాలు మాని పని చేశారు చంద్రబాబు అన్న. అలాంటిది ఆయనకి బహుమానం జైలు శిక్షనా అని ఆమె ప్రశ్నించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వంలో వున్నా ప్రతిపక్షంలో వున్నా ఎప్పుడూ కూడా ప్రజల మధ్యనే ఉన్నారని అని చెప్పారు. ప్రజలే చంద్రబాబుకి దేవుళ్ళని. రాష్ట్రమే ఆయన ఇల్లు అని భువనేశ్వరి అన్నారు. జనం కోసం పుట్టి వాళ్ల కోసమే బతికే ఆయనని కాపాడాల్సిన బాధ్యత జనం మీదే ఉందని ఆమె అన్నారు.
తన తండ్రి ముఖ్యమంత్రి. భర్త ముఖ్యమంత్రి. కొడుకు మంత్రిగా చేశారని ఈ ముగ్గురి హయాంలో తాను కానీ కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు సొంతానికి ప్రభుత్వాన్ని, అధికారాన్ని వాడుకోలేదని ఆమె చెప్పారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రతిరోజు వేలాది ప్రాణాలని నిలుపుతున్నామని ఆమె అన్నారు. తన సోదరుడు బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా రోగులకు పునర్జన్మని ప్రసాదిస్తున్నామని ఆమె తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా ట్రస్టు ద్వారా సొంత నిధులతో సేవలను అందిస్తున్నామని కూడా ఆమె చెప్పారు.
Also read: