Advertisement
జగన్ వైసీపీ పాలనలో తన అనుచరులకు, మనుషులకు నామినేటెడ్ పదవుల్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ క్రమంలోనే తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నందమూరి లక్ష్మీపార్వతిని జగన్ నియమించారు. లక్ష్మీపార్వతి కన్నా అర్హులు ఎందరో ఉన్నా కూడా కేవలం తమ పార్టీ నేత కాబట్టి ఆమెకు పదవి కట్టపెట్టారని విమర్శలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్మీపార్వతి కి షాక్ ఇచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ లక్ష్మీపార్వతికి ఇచ్చిన గౌరవ ఆచార్యురాలు హోదాను ఉపసంహరించుకుంటున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది.
Advertisement
అయితే ఈ ప్రకారం యూనివర్సిటీ రిజిస్టర్ ఎన్ కిషోర్ బాబు ప్రకటన విడుదల చేశారు. లక్ష్మీ పార్వతికి యూనివర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని ఆయన చెప్పారు. ఆమె తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా విధులు నిర్వహించిన సమయంలో కూడా యూనివర్సిటీ పరిశోధకులకు గైడ్ గా విధులు నిర్వహించారు.
Advertisement
Also read:
Also read:
తాజాగా ఆ విధుల నుంచి లక్ష్మీపార్వతిని తప్పించినట్లు కిషోర్ చెప్పారు. ఆమె దగ్గర మార్గదర్శకం కోసం చేరిన రీసెర్చ్ స్కాలర్స్ ను మరో ఆచార్యునికి బదిలీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఏది ఏమైనా జగన్ హయాంలో ఊరికే పదవులు పొందిన లక్ష్మీపార్వతి వంటి నేతలపై చంద్రబాబు తన మార్కు నిర్ణయంతో షాక్ ఇస్తున్నట్లు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!