Advertisement
చంద్రబాబు నాయుడు కు మధ్యంతర బెయిల్ లభించింది. చంద్రబాబు నాయుడు దాదాపు నెల రోజుల పైనే జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నాలుగు వారాల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు హై కోర్ట్ పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రికి కంటిశుక్లం శస్త్రచికిత్స చేయాల్సి ఉందని నయీం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిఐ ప్రకారం, కోర్టు అతని రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను నవంబర్ 10కి వాయిదా వేసింది. రెండు పూచీకత్తులతో ₹ 1 లక్ష బెయిల్ బాండ్‌ను టీడీపీ అధినేత అందించాలని ధర్మాసనం ఆదేశించింది. “అతను తన ఖర్చుతో తనకు నచ్చిన ఆసుపత్రిలో తనను తాను పరీక్షించుకోవాలి మరియు చికిత్స పొందాలి” అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Advertisement
గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే కంటికి ఆపరేషన్ చేసి వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని డాక్టర్లు కూడా సూచించారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కె. పట్టాభి రామ్ తెలిపారు. అయితే.. మరోవైపు ప్రభుత్వం తరపు లాయర్లు కూడా గట్టిగానే వాదించారని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో ఉండగానే చంద్రబాబు నాయుడు ఒక కేజీ బరువు కూడా పెరిగారని చెప్పుకొచ్చారు. జైల్లో ఉన్న వైద్య బృందం చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని తరచూ పరీక్షిస్తోందని తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తన వ్యక్తిగత వైద్యులు చెబితే తప్ప ఏ మందులను వేసుకోనని చెప్పడంతో.. ఈ విషయమై చంద్రబాబు నాయుడుగారి భార్య భువనేశ్వరికి రెండుసార్లు లేఖ రాశామని.. కానీ ఆవిడ ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు.
Advertisement
దీన్ని బట్టి సిబిఎన్ అంత ప్రమాదకరమైన పరిస్థితిలో లేదని తెలుస్తోందన్నారు. ఇక చంద్రబాబు నాయుడు చర్మ సంబంధ సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని.. వాటికి ప్రభుత్వం తరపు వైద్య బృందం చికిత్స అందిస్తోందని పేర్కొన్నారు. ఇక కంటి ఆరోగ్యం కూడా మెరుగ్గానే ఉందని, చంద్రబాబు నాయుడు చేయించుకోవాల్సిన ఆపరేషన్ ఇప్పటికిప్పుడు చేయించాల్సినంత అత్యవసరమైనది ఏమీ కాదని అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు కూడా గట్టిగానే వాదిస్తుండడంతో ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయితే.. ఈ సమయంలో ఆయన తన సొంత ఖర్చుతో, వైద్యం చేయించుకుని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
Watch Video: