Advertisement
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు నాయుడు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా.. ఆయన న్యాయమే గెలుస్తుందని.. త్వరలోనే బయటకు వస్తానని బహిరంగ లేఖ రాసారు. అందరికి విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ.. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది అంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తానూ జైల్లో లేనని, ప్రజల హృదయాల్లోనే ఉన్నానని చంద్రబాబు నాయుడు తన బహిరంగ లేఖలో రాసుకొచ్చారు.
Advertisement
నలభై ఐదేళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్నా నా విశ్వసనీయతను, విలువలను ఎవ్వరూ చెరిపివేయలేరని.. ఒక్క క్షణం కూడా ఎవ్వరు తనని ప్రజల నుంచి వేరు చెయ్యలేరని చంద్రబాబు నాయుడు రాసారు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది.. త్వరలోనే బయటకు వస్తాను.. రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. నేను జైలులో లేను.. విధ్వంస పాలనని అంతం చేయాలనీ ఎదురు చూస్తున్న మీ సంకల్పంలో ఉన్నానని అన్నారు. జైలు గోడల మధ్య ఆలోచనల్లో నా నలభై ఐదేళ్ల ప్రజా జీవితం కళ్ళ ముందు కదులుతోంది.
Advertisement
ఓటమి భయంతో నన్ను ప్రజలకు దూరం చేసారని అనుకుంటున్నారు. కానీ, నేను అభివృద్ధి రూపంలో మీకు కనిపిస్తూనే ఉంటాను. నాపై అవినీతి ముద్ర వేయాలని అనుకున్నారు. కానీ, నా విశ్వసనీయతను, విలువలను ఎవ్వరూ చెరిపెయ్యలేరు. ఈ చీకట్లు తాత్కాలికం. సత్యం అనే సూర్యుని ముందు కారు మబ్బులు చెదరిపోతాయి. జైలు ఊచలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తియ్యవు. నన్ను ప్రజల నుంచి దూరం చెయ్యలేవు. ఈ దసరా కు పూర్తి స్థాయి మానిఫెస్టో ప్రకటిస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించాను. కానీ, అదే రాజమహేంద్రవరం జైలులో నన్ను బంధించారు. త్వరలోనే పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తాను.
ఎప్పడూ బయటకు రాని నందమూరి తారక రామారావు గారి బిడ్డ, నా భార్య భువనేశ్వరి నేడు నా కోసం బయటకు వచ్చింది. నా తరపున జనంలోకి వెళ్లాలని ఆమెని కోరాను. ఆమె కూడా అందుకు అంగీకరించింది. నా అరెస్ట్ తో తల్లడిల్లి మరణించిన వారి కుటుంబాలను నా తరపున ఆమె పరామర్శిస్తుంది. “నిజం గెలవాలి” పేరుతొ ఆమె మీ ముందుకు వస్తోంది. జనమే నా బలం, నా ధైర్యం. న్యాయం ఆలస్యం కావచ్చు. కానీ అంతిమంగా గెలిచి తీరుతుంది. నా క్షేమం కోసం కుల మతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్ధనలు ఫలిస్తాయి. చెడు గెలిచినా నిలవదు. ఇది తాత్కాలికమే. త్వరలోనే చెడుపై మంచి గెలిచి తీరుతుంది. అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.. అంటూ చంద్రబాబు నాయుడు తన లేఖలో రాసుకొచ్చారు.
మరిన్ని
Today Current Affairs in Telugu 2023: 26 అక్టోబర్ 2023 రోజువారి కరెంట్ అఫైర్స్
బాలయ్యని మ్యాచ్ చేయలేకపోతున్న మెగాస్టార్.. ఈ లెక్క ఎక్కడ తప్పుతోందంటే?