Advertisement
Chandrababu Naidu: ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవెలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు నెల రోజులు కావొస్తోంది. అయితే.. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడుకు బెయిల్ రాలేదు. నాన్ బెయిలబుల్ వారంట్ పై ఆయన అరెస్ట్ అవడంతో టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. మరో వైపు ఎన్నికలు దగ్గరలోనే ఉన్న క్రమంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో టీడీపీ వర్గాల్లో అల్లకల్లోలం నెలకొంది.
Advertisement
వీటిని కూడా చదవండి: నాకు 40… తనకు 20.! ఇది మా స్టోరి!
వీటిని కూడా చదవండి: అలా వర్క్ అవుట్ అవ్వకపోవడంతో.. షర్మిల ఈ నిర్ణయం.. మరి ఎంత వరకునో..?
Advertisement
ఇది ఇలా ఉండగా.. చంద్రబాబు నాయుడు నవంబర్ నెలాఖరు వరకు విడుదల అయ్యే అవకాశాలు లేవని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ 17A చెల్లుబాటుపై పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి సుప్రీమ్ కోర్ట్ లో నవంబర్ 20 వ తేదీన విచారణ జరగనుంది. ఈ విచారణ పూర్తి అయ్యే వరకు చంద్రబాబు నాయుడు తరపు లాయర్ల 17A వాదనను పరిగణన లోకి తీసుకోవద్దని సిబిఐ సుప్రీమ్ కోర్ట్ ని కోరనుంది.
సిబిఐ వినతిని సుప్రీమ్ కోర్ట్ పరిగణనలోకి తీసుకుంటే చంద్రబాబు నాయుడు తరపు లాయర్ల వాదన వాయిదా పడే అవకాశం ఉంది. ఈ మేరకు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నాయి. ఈ పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో.. చంద్రబాబు నాయుడు నవంబర్ నెలాఖరు వరకు జైలులోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయమై టీడీపీ వర్గాలు ఇంకా స్పందించలేదు. ఈ విషయమై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని.. ఏపీ పాలిటిక్స్ లో పెను సంచలనం…?