Advertisement
కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సేవాతత్వం, విలక్షణాలతో అత్యున్నతమైన నాయకుడిగా ఎదిగారు నారా చంద్రబాబు నాయుడు. 1950 ఏప్రిల్ 20వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా నారావారిపల్లెలో నారా ఖర్జూర నాయుడు, అమనమ్మ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు చంద్రబాబు నాయుడు. ఈయనకి ఒక తమ్ముడు నారా రామమూర్తి నాయుడు, ఇద్దరు చెల్లెలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుండి 1977లో బిఏ డిగ్రీ పూర్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. చిన్నప్పటినుండే చంద్రబాబు నాయుడుకి ప్రజాసేవ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది.
Advertisement
READ ALSO : Nani Dasara Movie Review in Telugu: నాని “దసరా” మూవీ రివ్యూ & రేటింగ్.. హిట్ కొట్టినట్టేనా..?
దీంతో చదువుకునే రోజుల్లోనే చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్ లో చేరారు. చిత్తూరు జిల్లాలో యువ నాయకుడిగా గుర్తింపు పొంది 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేశారు. 20 వేల మెజారిటీతో గెలిచి విశ్వవిద్యాలయం నుంచి శాసనసభలోకి అడుగుపెట్టారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ డెవలప్మెంట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇక 28 ఏళ్ల వయసులోనే సినిమాటోగ్రఫీ, పురవస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1980లో ఆయన నందమూరి తారక రామారావు కుమార్తెను పెళ్లి చేసుకున్నారు.
ఇక 1983 ఎన్నికలలో టిడిపి అభ్యర్థి చేతిలో ఓటమి తర్వాత.. అనంతరం కొన్ని పరిస్థితుల కారణంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత టిడిపిలో క్రమంగా శక్తివంతమైన నేతగా ఎదిగారు. ఇక 1995లో తన మామ ఎన్టిఆర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటినుంచి 2004 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే తదనంతర ఎన్నికలలో ఆయన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇక 2014 ఎన్నికలలో బిజెపితో పొత్తు కుదుర్చుకొని మొత్తం 175 సీట్లకు గాను 102 సీట్లను గెలుచుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి చరిత్ర సృష్టించారు. అంతేకాదు సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా పనిచేసిన రికార్డు కూడా ఆయనదే. ఇక 2018లో ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. ఇక 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందడంతో మరోసారి ప్రతిపక్ష నేతగా మిగిలారు.
Also Read: Dasara Movie Dialogues: నాని ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!
Advertisement