Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు గారు ఎప్పుడు బయటికి వస్తారు.. ఆయనకు ఎప్పుడు బెయిల్ వస్తుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఇటీవల రెండు తీర్పులు కూడా చంద్రబాబుకు అనుకూలంగా రాలేదు. క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టి వేయగా.. కస్టడి పిటిషన్ ను 2 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అక్టోబర్ 01వ తేదీన బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడుమనం తెలుసుకుందాం.
వీటిని కూడా చదవండి: ముఖ్యమంత్రి అయ్యాక సీనియర్ ఎన్టీఆర్ ఎల్లప్పుడూ కాషాయం దుస్తులు ఎందుకు ధరించారు? అసలు కారణం ఇదే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్, బాలయ్య ముగ్గురు కలిసి ఇటీవలే చంద్రబాబుతో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఆ ములాఖత్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ మీడియాతో జనసేన-టీడీపీ పొత్తుల గురించి ప్రస్తావించడం గమనార్హం.
చంద్రబాబు లేరనే లోటును బాలయ్య, పవన్ కళ్యాణ్ తీర్చేస్తారని చంద్రబాబు ఆలోచనలో ఉందనేది తెలుస్తోంది. జైలులో ఉన్న చంద్రబాబు గురించి వదిలేస్తే.. ఎమ్మెల్యే, ఎంపీలు, నందమూరి కుటుంబ సభ్యులు ఇలా ఒక్కరైనా జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించలేదు.
Advertisement
ఆయన మాట ఎత్తలేదు. ఏపీలోని ఏ ఒక్క టీడీపీ నేత కూడా జూనియర్ ఎన్టీఆర్ అనే పదాన్ని ఇంతవరకు పలకలేదు. అయితే మీడియా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశ్నించగా.. అది ఆయన ఇష్టం అని చర్చించాడు.
జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని ఇక ముందుండి నడిపించాలనే డిమాండ్ ఏ ఒక్కరిలో రాలేదు.
వీటిని కూడా చదవండి: ఎన్టీఆర్ ని ఆపుతున్న ఆ శక్తి ఏమిటి ? CBN అరెస్ట్ ఎన్టీఆర్ ఏడాది క్రిందటే తెలుసా ?
ముఖ్యంగా చంద్రబాబు ఓడిపోయినప్పటి నుంచి 23 అనే నెంబర్ తో వైసీపీ నేతలు టీజ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి 23 మంది లాక్కున్నారు.
చివరికీ 23 మంది 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారంటూ.. వైసీపీ నేతలు విమర్శలు చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా 23 అనే సంఖ్యను వైసీపీ నేతలు తెగ వాడేశారు. ఈ మధ్య విజయసాయి రెడ్డితో సహా చాలా మంది వైసీపీ నేతలు 2023 సంవత్సరంతోనే మీ రాజకీయ జీవితం అంతం అయిపోతుందని కామెంట్స్ కూడా చేశారు.
ఆ రోజే ఎందుకంటే ?
ఈ లాజిక్ ని బట్టి చూస్తే.. 23 రోజుల పాటు చంద్రబాబును జైలులో ఉంచే ఏర్పాట్లు చేస్తారేమో అనే అనుమానం కొంతమందికి కలుగుతుంది. ఈ లెక్కన చూసుకుంటే.. సెప్టెంబర్ 09 శనివారం రోజు చంద్రబాబును అరెస్ట్ చేశారు.
23 రోజులు అంటే.. అక్టోబర్ 01న బెయిల్ అందించే ఛాన్స్ ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.
వీటిని కూడా చదవండి: ఢిల్లీకి ఏపీ సిఐడి పోలీసులు… నారా లోకేష్ అరెస్టు ఖాయమేనా ?