Advertisement
లైగర్ మూవీ అట్టర్ ప్లాప్ కావడంతో చిత్ర బృందం ఇంతవరకు స్పందించలేదు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన లైగర్ మూవీ రికార్డులు బద్దలు కొడుతుందని అంతా భావించారు. దీంతో విజయ్ కూడా బాలీవుడ్ లో పాగా వేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, అనుకోకుండా సినిమా ఫలితం నెగటివ్ గా రావడంతో దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మి, హీరో విజయ్ ఎవరు బయటకు రావడం లేదు. ఇక ఈ సినిమా ఫెయిల్ కావడంతో కొందరు సంబరాలు కూడా చేసుకుంటున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే లైవ్ స్పందించారు.
Advertisement
అంతేకాదు ఇక సినిమా విడుదలైన మొదటి షోకే ఫలితం తెలియడంతో చార్మి తన సన్నిహితుల దగ్గర ఎమోషనల్ అయిందంట. దాదాపు సినిమా 200 కోట్ల మేర నష్టాన్ని ఇచ్చిందంట చెప్పడం కోసమెరుపు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ చార్మి చాలా కష్టపడి ఆస్తులను కూడగట్టి ఇలా లైగర్ రూపంలో పూర్తిగా కోల్పోయినట్టుగా తన సన్నిహితులతో చెప్పి బాధపడుతుందట చార్మి. జనగణమన సినిమాపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశాలు ఉండటంతో చార్మి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.
Advertisement
ఇక అటు సోషల్ మీడియాలో విజయ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా ఫలితం బాగుందని కొందరికి నచ్చగా, మరికొందరికి నచ్చలేదని తెలిసింది. కానీ నా పర్ఫార్మెన్స్ విషయంలో జనాలు పాజిటివ్ గానే ఉన్నారు. సినిమాలో హీరోకు నత్తి పెట్టడం వలన డైలాగ్స్ అర్థం కావడం లేదని కొందరు అంటున్నారు. కానీ సినిమాకి అదే కీ పాయింట్. మనిషి తనలోని లోపాన్ని ఎదిరించి విజయం ఎలా సాధించాడు అనేదే అసలు పాయింట్ అని విజయ్ క్లారిటీ ఇచ్చాడు.
READ ALSO : సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె ఏం చేస్తుందంటే..!