Advertisement
సాధారణంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలామంది నటులు ఇండస్ట్రీలోకి వచ్చి సెన్సేషనల్ పాత్రలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందుతారు.. అలాంటి వాటిలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి మూవీ ద్వారా సూరీడు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎంతో పేరు సంపాదించు కున్నారు.. మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వ్యక్తి ఎవరో చాలా మందికి తెలియదు.. మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం..
Advertisement
Chatrapathi movie Child Artist
ALSO READ: ఈ 5 లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోరాదట.. !
Advertisement
చత్రపతి సినిమాలో చిన్నప్పటి సూరీడు పాత్రలో చేసిన వ్యక్తి పేరు బస్వంత్ వంశీ.. ఈయన ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.. అయితే చత్రపతి సినిమా కోసం ఆడిషన్స్ పిలవగా 100 మందిలో బస్వంత్ ను రాజమౌళి ఎంపిక చేశారు.దింతో ఈ కుర్రాడు ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఇందులో సూర్యుడి పాత్రలో మెప్పించిన వంశీ తర్వాత పై చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్లి వచ్చాడు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా రాణించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ తరుణంలో ఆయనకు సంబంధించిన చత్రపతి సినిమా ఫోటోలతో ప్రస్తుత ఫోటోలు జత కలిపి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీన్ని చూసిన నెటిజన్స్ చిన్నప్పటి సూరీడు ఇంత పెద్ద అయిపోయాడని కామెంట్లు పెడుతున్నారు.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బసంత్ వంశీని తెరపై హీరోగా చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.. మరి చూడాలి ఈయన ఏ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో..
ALSO READ:తెలుగు ఇండస్ట్రీలో టాప్ విలన్లు.. వారి అందమైన భార్యలను మీరు ఎప్పుడైనా చూసారా..?