Advertisement
టీమిండియా ప్లేయర్ల గురించి అలాగే జట్టులో ఉన్న విభేదాల గురించి జీ న్యూస్, వియాన్ వెబ్సైట్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి ఫిట్నెస్ కోసం టీమిండియా ప్లేయర్లు పట్టుబడ్డని ఇంజక్షన్లు ఉపయోగిస్తరని, సౌరవ్ గంగూలీ మరియు విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయని… రోహిత్ శర్మ టి20 కెరీర్ ముగిసిందని చేతన్ శర్మ చెప్పడం తీవ్ర దుమారం రేపింది. ఈ స్ప్రింగ్ ఆపరేషన్ నేపథ్యంలో తప్పు చేశానని భావించిన చేతన్ శర్మ… ఇటీవల బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా కూడా చేశారు.
Advertisement
అయితే జీ న్యూస్ మరియు వియాన్ రిపోర్టర్లు చేతన్ శర్మను పథకం ప్రకారమే ఇరికించినట్లు సమాచారం అందుతుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో భారత క్రికెట్ కు సంబంధించిన…. ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నామని… చేతన్ శర్మాను సంప్రదించినట్లు సమాచారం. 8 ఎపిసోడ్స్ తో కూడిన ఈ వెబ్ సిరీస్ కు… కథను సిద్ధం చేస్తున్నామని… దానికి ఇన్పుట్స్ కావాలని చేతన్ శర్మను కోరినట్లు సమాచారం.
Advertisement
అమెజాన్ వేదికగా విడుదలైన ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ లాగే…. ఇది ఉంటుందని, ఎవరి పేర్లను ఇందులో ప్రస్తావించబోమని నమ్మించినట్లు ఇన్సైడ్ స్పోర్ట్స్ వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచూరించింది. సదరు వ్యక్తులు ఎంత చెప్పినా చేతన్ శర్మ అంగీకరించలేదని, దగ్గరకు కూడా రానివ్వలేదట. వారు జర్నలిస్టులు అనే విషయం కూడా చేతన్ కు తెలియదట. అయితే బీసీసీ పెద్దల సపోర్ట్ కూడా తమకు ఉందని.. వారు చెప్పడంతో చేతన్ శర్మ… దీనికి ఒప్పుకున్నారట. ఈ వెబ్ సిరీస్ ద్వారా వచ్చే ఆదాయంలో చేరు కూడా ఇస్తామని చెప్పడంతో చేతన్ శర్మ ఓపెన్ అయినట్లు సమాచారం.