Advertisement
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే.. వచ్చే 30 ఏళ్లూ మనమే అధికారంలో ఉంటామని ప్రకటించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. నిన్న టెక్కలి నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని.. ఇవ్వాళ్టి నుంచి అడుగులు కరెక్టుగా పడితేనే.. మనం క్లీన్‌స్వీప్ చేయగలుగుతామని పేర్కొన్నారు.
Advertisement
చాలా నియోజకవర్గాలకు సంబంధించిన ఇలాంటి సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయని.. గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతోందని వెల్లడించారు. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన జరుగుతోందని… ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల రూ.1026 కోట్ల రూపాయలు గడపగడపకూ చేర్చగలిగామన్నారు సీఎం జగన్. ఎవరెవరికి ఇచ్చామో.. ఆధార్ కార్డు వివరాలతో సహా, అక్కచెల్లెమ్మల పేర్లతో సహా చెప్పగలిగేలా ప్రతి ఇంటికీ చేర్చగలిగామని.. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ఎవ్వరూ మిస్ కాకుండా, సంతృప్తస్థాయిలో, ప్రతి 50 ఇళ్లకుఒక వాలంటీర్ ద్వారా, ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ద్వారా వీటిని చేర్చామని చెప్పారు.
Advertisement
అర్హత ఉన్నవారికి మిస్ కాకూడదనే తపన, తాపత్రయంతో అడుగులు వేశామని… గతానికి భిన్నంగా ప్రతి కుటుంబానికి మేలు చేశామని పేర్కొన్నారు. ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు 175 కి 175 నియోజకవర్గాలు ఎందుకు మనం కొట్టలేమా ? తప్పకుండా గెలవగలుగుతామని భరోసా కల్పించారు. టెక్కలి నియోజకవర్గంలో భావనపాడు పోర్టు కూడా రాబోతుందని… సుమారు రూ.4362 కోట్లు కూడా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. డిసెంబరులో దీనికి శంకుస్థాపన చేయబోతున్నాం… మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులు డిసెంబరులో పునరుద్ధరణ చేయబోతున్నామని ప్రకటన చేశారు సీఎం జగన్.
Read also : మాకు కాశ్మీర్ వద్దు.. కోహ్లీని ఇచ్చేయండి ప్లీజ్ !