Advertisement
Athadu Child Artist: అతడు సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. సినిమాలో సోనుసూద్ మహేష్ బాబుకు స్నేహితుడిగా నటించి అతడినే మోసం చేసే పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లల దూసుకుపోతాయి.
Advertisement
సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ఇక ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ మిస్ చేసుకున్నారు. నిజానికి మొదట త్రివిక్రమ్ అతడు సినిమా కథను ఉదయ్ కిరణ్ తో చేయాలనుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను కూడా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కలిశాడు.
Advertisement

అయితే అతడు బ్రహ్మానందం తన శరీరం ఎంత గట్టిగా ఉందో చూడమని చేబితే పొట్టపై టచ్ చేసి ‘మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందిరా’! అంటూ నవ్వులు పంచిన బాల నటుడు గుర్తున్నాడా? అతడే దీపక్ సరోజ్.
ఆర్య, భద్ర, మినుగురులు, లెజెండ్ తదితర చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన తను ఇప్పుడు హీరోగా మారాడు. ఈయన కథానాయకుడిగా వి.యశస్వి తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు.

athadu child artist
సిద్ధార్థ్ రాయ్ అనే పేరు ఖరారైన ఈ సినిమాని యువతను లక్ష్యంగా చేసుకొని రూపొందుతున్నట్టు తెలుస్తోంది. పోస్టర్ లో దీపక్ పొడవాటి జుట్టు, రెండు సిగరెట్లు కాలుస్తూ, ఓ గులాబీ పువ్వు పట్టుకుని కనిపించారు. ఈ చిత్రంలో తన్వి నేగి కథానాయికగా నటిస్తోంది.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?




