Advertisement
సనాతన ధర్మంపై ప్రసంగాలతో ప్రసిద్ధి చెందిన భారతీయ వక్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు సింగర్ చిన్మయి శ్రీపాద. ఆడది ముందు నడవకూడదు మగాడు ముందు నడవాలి అని ఏదో చెప్పుకొచ్చారు. ఇలాగే నడవాలని రాముడు కృష్ణుడు శివుడు చెప్పారా అసలు దేశంలో ఆడదాన్నిగా పుట్టకుండా ఉండాల్సింది అని కౌంటర్లు వేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. భర్తతో బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే భార్య ఈ నియమాలు పాటించాలి అని ప్రవచనకర్తలు చెప్పారు.
Advertisement
శుభమంటే మంగళం శుభకార్యం జరిగే దగ్గర పసుపు కుంకుమ పూలు ఇస్తారు. భర్త వెనుక ఆమె నడిచి వస్తుందంటే సుమంగళి అని చెప్పకనే చెప్పినట్లు అర్థం. అందుకే శుభకార్యానికి వెళ్ళేటప్పుడు భర్త వెనుక భార్య నడవాలి. శుభకార్యానికి పిలిస్తే వెళ్తారు కానీ అశుభగానికి పిలవకపోయినా వెళ్లాలి. అలాంటప్పుడు అక్కడ ఎవరు ఎలా స్పందిస్తారో తెలియదు. కొన్నిసార్లు శత్రువు ఇంట్లో అశుభం జరిగిందని తెలిసినా పలకరించడానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో స్త్రీలు ముందు కనిపిస్తే పరుష పదాలు మాట్లాడాల్సిన వాళ్లు కూడా కాస్త వెనక్కి తగ్గుతారు.
Advertisement
Also read:
భార్య చేసిన పాపంలో భర్తకు భాగం ఉండదు కానీ భర్త చేసిన పుణ్యం లో భార్యకు భాగం ఉంటుంది. భర్త చేసిన పాపంలో మాత్రం భార్యకు అసలు భాగం ఉండదు అయితే నిజానికి ఇందులో చిన్మయికి ఏమి అర్థమైందో స్త్రీ వెనుక నడవాలి అన్నమాట తప్ప ప్రవచనంలో ఆమెకి ఏమీ అర్థం కాలేదేమో. రాముడు కృష్ణుడు చెప్పారా అంటూ ఆమె కామెంట్లు చేశారు చిన్మయి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ గా ఎప్పుడు నిలుస్తూనే ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. తన భర్త రాహుల్ రవీంద్రన్ పాప గురించి పెట్టిన పోస్ట్ చూసి నెటిజెన్స్ ట్రోల్ చేశారు. ఇలా పలు సార్లు ఆమె కాంట్రవర్సీలకి గురయ్యారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి