Advertisement
నటి శ్రీజ మరియు కళ్యాణ్ దేవ్ చాలా కాలం క్రితమే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి విడాకులకు ముందు నుంచే వీరిద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు హాల్ చల్ అయ్యాయి.. ఆ తరువాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. వీరికి నవిష్క అని కూతురు ఉంది. ఆమె ప్రస్తుతం శ్రీజ వద్దే ఉంటోంది. శ్రీజ మరియు కళ్యాణ్ దేవ్ 2016 లో వివాహం చేసుకున్నారు. శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి కుదరలేదు. వీరిద్దరూ 2007 లో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2011 లో వీరు విడాకులు తీసుకున్నారు. దీనితో శ్రీజ తమ దగ్గరి బంధువు అయిన కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది.
Advertisement
అయితే సోషల్ మీడియాలో వీరిద్దరూ విడిపోయినట్లు అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఫోటోలను తొలగించడం, ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో వారిద్దరూ విడిపోయారు అని అభిమానులు అర్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ దేవ్ కూడా తన కూతురుని మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ వచ్చారు. దానితో వారిద్దరూ విడిపోయారు అన్న వార్తలు వచ్చాయి.
Advertisement
తాజాగా.. చిరంజీవి కూతురు శ్రీజ గురించి మరొక వార్తా వైరల్ అవుతోంది. ఆమె మూడవసారి వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో గతంలో ఆమె చేసిన పోస్ట్ లను చూసి కూడా ఆమె మూడో పెళ్ళికి ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా.. ఓ వ్యక్తితో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో అతనే శ్రీజ బాయ్ ఫ్రెండ్ అనీ.. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. వీటిపై ఇప్పటి వరకు శ్రీజ కానీ, మెగా ఫ్యామిలీ కానీ స్పందించలేదు.
మరిన్ని..
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిలియనీర్లు ఎవరో తెలుసా? ఎంత మంది ఉన్నారంటే?
ఢిల్లీ మెట్రోలో మరో నీచం.. వైరల్ అవుతున్న కపుల్ వీడియో, తిట్టిపోస్తున్న నెటిజన్స్!