Advertisement
మనకందరికీ చంద్రముఖి అంటేనే రెండు విషయాలు టక్కుమని గుర్తొస్తాయి. ఒకటి జ్యోతిక రారా అని పిలవడం, రెండోది రజిని లకలకలకలక డైలాగు. ఈ సినిమాకి రజిని మేనరిజం, స్టార్ డం తో పాటు, జ్యోతిక నటన తోడవడం ఒక ఎత్తు అయితే, నయనతార గ్లామర్ కూడా ప్లస్ అయ్యి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది. అయితే ఈ సినిమాకు చిరంజీవికి ఉన్న సంబంధమేంటి? ఇందులో కీలక పాత్ర కోసం తోలుతా స్నేహాను అనుకోగా ఆ పాత్రలోకి జ్యోతిక వచ్చిందా? అనే విషయాలు తెలుసుకుందాం.
Advertisement
రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ ఫిలిం కు సీక్వెల్ కూడా స్టార్ట్ అయింది. ‘చంద్రముఖి-2’ లో హీరోగా లారెన్స్ రాఘవ నటిస్తున్నాడు. ఈ సంగతులు అలా పక్కన పెడితే ‘చంద్రముఖి’ చిత్రం రీమేక్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. మాలివుడ్ సూపర్ హిట్ మూవీ ‘మనీచిత్రతాయ’ రీమేక్ చంద్రముఖి చిత్రం. ఈ సినిమాను తోలుతా చిరంజీవి చేయాలనుకున్నారట. డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్యనే తెలుగు రీమేక్ కు దర్శకుడిగా ఫైనల్ చేశారట. కానీ, అప్పుడున్న పరిస్థితుల వలన అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అలా చిరంజీవి ఆ రీమేక్ మూవీ గురించి పక్కన పెట్టేసారట. ఈ క్రమంలోనే ‘మనీచిత్రతాయ’ సినిమా చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆ చిత్రం బాగా నచ్చి వెంటనే తెలుగు, తమిళ్ భాషల్లో రీమేక్ చేయాలనుకున్నాడు, చేసేసాడు.
Advertisement
అలా ఆయన అనుకున్న వెంటనే దర్శకుడిగా పి.వాసును ఫైనల్ చేసుకున్నారట. అలా ఈ పిక్చర్ కు పి.వాసు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేయగా, ఇందులో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, వడివేలు, నయనతార నటించారు. ఇక ఇందులో జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించింది. చంద్రముఖిగా జ్యోతిక తప్ప మరెవరు నటించలేరని సినిమా చూసి ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ చిత్రంలో తోలుతా మెయిన్ హీరోయిన్ గా స్నేహను అనుకున్నారట. కానీ, ఆ పాత్రకు హోమ్లీ హీరోయిన్ స్నేహ సూట్ కాదనుకొని సిమ్రాన్ వద్దకు వెళ్లారట. ఆ తర్వాత సిమ్రాన్ వద్దకు ఈ సినిమా వెళ్లిందట. కాగా, ఆమె అప్పటికే గర్భవతి కాగా, ఆమె చేసే పరిస్థితి తేలేదు. ఇక చివరకు ఆ పాత్ర జ్యోతిక వద్దకు వచ్చింది. అలా చంద్రముఖి పాత్రలో జ్యోతిక పరకాయ ప్రవేశం చేసి ఇరగదీసింది.
Read also : చిరంజీవి నుంచి సమంత వరకు, మన స్టార్లు ఇష్టంగా తినే ఫుడ్స్ ఇవే!