Advertisement
మెగాస్టార్ చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకు వెళ్తున్నారు అయితే గత కొన్నాళ్ల నుండి కూడా హైదరాబాద్ మహానగరం ఎలా అభివృద్ధి చెందుతుందో మనం చూస్తున్నాం. కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలకడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాదులో ఎకరం కొనుగోలు చేసే డబ్బుతో ఏదైనా చిన్న చిన్న గ్రామాలలో వందల ఎకరాలని కొనుగోలు చేయొచ్చని అందరూ అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా బాగానే వెనకేసారు.
Advertisement
Advertisement
కోకాపేటలో 20 ఎకరాలు ఆయనకి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 20 ఎకరాల్లో కొంచెం సోదరీమణులకు కూడా ఆయన ఇచ్చినట్లు తెలుస్తోంది. కోకాపేటలో భూములు విలువ బాగా పెరగడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అదే టాపిక్ వినపడుతోంది. మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలు ద్వారా వచ్చిన డబ్బుని భూమి మీద ఇన్వెస్ట్ చేశారని తెలుస్తోంది. అయితే సుమారు ఎంత ఉంటుందనేది అంచనా వేయలేమని అంటున్నారు. ఇదిలా అంటే ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్నారు ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. అందుకు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.
Also read: