Advertisement
కొన్ని కొన్ని సార్లు సినిమాలు రిలీజ్ అవ్వడానికి ముందు కొన్ని విషయాలు లీక్ అవుతూ ఉంటాయి. ఇవి స్టార్లు చెప్తే తప్ప బయటకి రావు. తగిన సందర్భం కుదిరితే చెప్తారు. నెట్ఫ్లిక్ సంస్థ రాజమౌళి మీద రూపొందించిన మోడరన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ సిరీస్ స్పెషల్ ఎపిసోడ్ వచ్చింది. గంటన్నర ఆయన లైఫ్ గురించి కెరియర్ గురించి పనిచేసిన ఆర్టిస్టులు సాంకేతిక నిపుణుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేయడంతో అందరి హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఏమేం చెప్పి ఉంటారు అనే దాని గురించి ఫాన్స్ లో ఎక్కువగా ఆసక్తి ఉంది.
Advertisement
స్వయంగా రామ్ చరణ్ చెప్పిందే ఇది. మగధీరకు ముందు ఆయన తండ్రి చిరంజీవి సింహాద్రి చూశారట. ఒక్కసారిగా మైండ్ బ్లోయింగ్ గా అనిపించే రేంజ్ లో జక్కన్న దర్శకత్వం చూసి నోట మాట కూడా రాలేదు. అంత మెగాస్టార్ ని కేవలం రెండో సినిమాతోనే మెప్పించిన దర్శక ధీరుడు అప్పట్లోనే ఏ స్థాయిలో ప్రభావం చూపించారో ఈ ఉదాహరణను బట్టి తెలుసుకోవచ్చు. కొంచెం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే సింహాద్రి టైంలో చిరుకి గట్టి పోటీ ఇచ్చేవారు వచ్చారని అప్పటి కొన్ని మీడియా సాధనాల్లో తారక్ పై కథనాలు వచ్చాయి.
Advertisement
Also read:
దానికి తగ్గట్టే సింహాద్రి ఆ టైం లో రికార్డులు నెలకొల్పింది. బాహుబలి, RRRతో రాజమౌళి ఎంత పెద్ద స్థాయికి చేరినా బలమైన పునాది వేసింది మాత్రం సింహాద్రి. భాషా, నరసింహారెడ్డి, ఇంద్ర తర్వాత ఆ హీరో తాలూకా ఫ్లాష్ బ్యాక్ ని వాటికంటే శక్తివంతంగా పక్క రాష్ట్రానికి తీసుకువెళ్లి మరీ మ్యాజిక్ చేసిన రాజమౌళి తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు లేకపోయింది. మగధీరకు పునాది వేసింది సింహాద్రి అని చెప్పొచ్చు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!