Advertisement
ఇది కేవలం టీచర్ మాత్రమే. ముందు ముందు సినిమా చూపిస్తామని మెగా అభిమానులు వైసీపీకే వార్నింగ్ ఇస్తున్నారు. సినిమా వాళ్ళ విషయంలో జగన్ ప్రభుత్వం చూపించిన అవమానాలు ఇప్పుడు టాలీవుడ్ లో మెగా అభిమానుల్లో మరో సారి చర్చనీయాంశంగా మారాయి. గతంలో చిరంజీవి టాలీవుడ్ సమస్యలను విన్నవించడానికి తోటి హీరోలు దర్శక నిర్మాతలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు, సినిమా టికెట్ రేటును అయిదు రూపాయలు చేశారు. దీంతో కొంతమంది సినిమా వాళ్ళతో కలిసి జగన్ తో సమావేశమై చిరంజీవి చేతులు జోడించి జగన్ని వేడుకున్నారు.
Advertisement
పెద్దమనిషి హోదాలో ఉన్న తమరు మీరు పెద్ద మనసుతో ఆదుకోవాలని చేతులు జోడించి అడుగుతున్నానని చిరంజీవి చెప్పారు. చిరంజీవి అంతటి సినిమా పెద్ద వెళ్లి అడిగినా జగన్ చలించలేదు. ఆయనకి అవమానం జరిగినట్లే అభిమానులు ఫీలయ్యారు. సినీ చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉన్నారని కూడా చూడకుండా ఇంటికి పిలిపించి మరీ అవమానించారు. ఇండస్ట్రీ కోసం ఎన్నో భరించారు. ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా అని చాలామంది అన్నారు. అవమానంతో రగిలిపోయిన పవన్ ఎన్నికల సమరంలో జగన్ ను పాతాళానికి తొక్కేసారని చెప్పొచ్చు.
Advertisement
Also read:
ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. స్వయంగా మంత్రి చిరంజీవిని కలిసి టాలీవుడ్ సమస్యలను తీరుస్తామని హామీ ఇవ్వడంపై తెలుగు సినిమా అభిమానులు ముఖ్యంగా మెగా ఫాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇటీవల ఎంపికైన కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. విశ్వంభర సెట్స్ కి వచ్చి చిరుని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కందుల దుర్గేష్ ఏపీ పర్యాటక సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోలను ఎక్స్ వేదికగా చిరు పంచుకున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!