Advertisement
మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. స్వయంకృషితో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా నిలిచారు. తాజాగా చిరుకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు లవ్ స్టోరీ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. చిరు టీనేజ్ లోనే ప్రేమలో పడిపోయారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ నిజ జీవితంలో లవ్ స్టోరీ ఉంది ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఏడవ క్లాస్ లోనే ఆమెను నేను ప్రేమించడం మొదలుపెట్టానని చిరంజీవి అన్నారు.
Advertisement
Advertisement
ఆ సమయంలో సైకిల్ తొక్కుతూ ఆ అమ్మాయి మా ఇంటి ముందు వెళ్లేది. నాకేమో సైకిల్ తొక్కడం రాదు కానీ అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మొగల్తూరులో చాలా గొప్ప విషయం అని చిరు అన్నారు. తాను నా క్లాస్మేట్ కాబట్టి నేను మెల్లిగా పరిచయం పెంచుకున్నాను నాకు తను ఫ్రెండ్ అయింది. ఆ టైంలో నేను నాకు సైకిల్ నేర్పించమని అడిగాను. సైకిల్ తొక్కుతూ ఆమెని సేడ్ నుండి చూసేవాడినని చిరంజీవి అన్నారు.
Also read:
కానీ ఎప్పుడూ ఆమెకు నేను ప్రేమించిన విషయం చెప్పలేదని అన్నారు. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయాము. ఇప్పటికీ ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అని లాల్ సద్దా సినిమా ప్రమోషన్స్ టైం లో చిరు ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం చూడండి!