Advertisement
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పడం కష్టం. ఒక్కోసారి భారీ అంచనాల నడుమ అనేక హంగులతో సినిమాలు వస్తూ ఉంటాయి.. దానిపై అభిమానులు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు.. కానీ సినిమా తీరా విడుదలయ్యాక మెప్పించలేక పోతుంది.. కానీ కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితిలో విడుదలవుతాయి. ఇలాంటి సినిమాలు ఒక్కోసారి అంచనాలు దాటి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధిస్తాయి.
Advertisement
కట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి ఆదరాభిమానాలు ఉన్న హీరోనో మనందరికీ తెలుసు. ఆయన సినిమా వస్తుంది అంటే అభిమానులకు అనేక అంచనాలు ఉంటాయి. దర్శక, నిర్మాతలకు అయితే ఆయన సినిమాతో లాభాల పంట పండుతుందనే ఒక పేరు ఉంది.. అలాంటి చిరంజీవితో సినిమా తీసి వారి జీవితం నాశనం చేసుకున్న ముగ్గురు స్టార్ డైరెక్టర్ ఉన్నారు. వారెవరు ఏ సినిమాలు తీసి వారు కెరీర్ నాశనం చేసుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వివి వినాయక్ :
మెగాస్టార్ చిరంజీవి 20 సంవత్సరాల తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 లో వచ్చారు. ఈ సినిమా హిట్ అయింది కానీ ఆ తర్వాత వి.వి.వినాయక్ కు ఒక్క హిట్టు కూడా పడలేదు. దీంతో ఆయన కెరీర్ ఆగిపోయింది.
Advertisement
ALSO READ:రైళ్లలో డోర్ దగ్గర విండోస్ కు ఎందుకు ఎక్కువ ఇనుప కడ్డీలు ఉన్నాయి?
సురేందర్ రెడ్డి :
సైరా నరసింహారెడ్డి ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఆయన సినిమా వచ్చింది అంటే వేరే లెవెల్ లో ఉంటుంది.. అలాంటి దర్శకుడు కొత్త కథతో సైరా నరసింహారెడ్డి తీశారు. మూవీ అంతగా ఆడక పొగ, 400 కోట్ల బడ్జెట్ పెడితే కనీసం ఒక వంతు కూడా వసూలు చేయలేదట. ఈ మూవీ తర్వాత సురేందర్రెడ్డి ఒక్క సినిమా కూడా తీయలేదు.
కొరటాల శివ :
సంచలన డైరెక్టర్ కొరటాల శివ సినిమా ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు.. ఆయన చిరంజీవి,రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య మూవీ చేశారు. ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఆయన ఈ సినిమాతో బోల్తా పడ్డారు. దీంతో ఆయన కెరియర్ మధ్యలోనే బ్రేక్ పడ్డంత పని అయింది.
ALSO READ: