Advertisement
చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు. 150 కి పైగా సినిమాల్లో నటించారు. 500 కి పైగా పాటలకు డాన్స్ చేశారు. 24000 స్టెప్స్ వేశారు. ఈ అరుదైన ఘనత అందుకున్న హీరో మరొకరు లేరు. దీంతో ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సాధించారు. స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 1978లో చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు విడుదలైంది 1980లో అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో పెళ్లి అయింది. సురేఖను పెళ్లి చేసుకోక ముందు చిరంజీవి ఒక అమ్మాయి తో ప్రేమలో పడ్డారు.
Advertisement
ఆమెను ఎంతగానో ప్రేమించారు. ఓ సందర్భంలో చిరంజీవి తన ఫస్ట్ లవ్ గురించి చెప్పారు. లాల్ సింగ్ చద్దా తెలుగు వర్షన్ ప్రమోషన్స్ కోసం అమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చారు. నాగచైతన్య సైతం ఓ రోల్ చేశారు. ఈ క్రమంలో చిరంజీవి, నాగచైతన్య, నాగార్జున. అమీర్ ఖాన్ ఒక ఈవెంట్ నిర్వహించారు.
Advertisement
Also read:
అప్పుడు చిరు మాట్లాడుతూ ఏడవ తరగతిలో ఒక అమ్మాయి రోజూ సైకిల్ తొక్కుతూ స్కూల్ కి వెళ్ళేది ఆ రోజుల్లో మా మొగల్తూరులో ఆడపిల్ల సైకిల్ తొక్కడం అంటే సామాన్య విషయం కాదు. ఆ అమ్మాయితో నాకు పరిచయం, చనువు ఉంది. నాకు సైకిల్ తొక్కడం వచ్చు కానీ ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు సైకిల్ నేర్పిస్తావా అని అడిగాను. అలా అమ్మాయి సైకిల్ నేర్పించేదని ఆ అమ్మాయిని చూస్తుండే వాడినని చిరంజీవి అన్నారు. ఆమె తన ఫస్ట్ లవ్ అని చిరంజీవి చెప్పారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!