Advertisement
మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటిి నరసింహా రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు నిర్వహించిన ” అలయ్ బలయ్” కార్యక్రమంలో గరికపాటి మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో ఫోటోలు దిగడానికి చాలామంది మహిళలు, యువతులు స్టేజి మీదకి వచ్చారు. ఆ గందరగోళంలో గరికపాటి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆయన ఒకింత అసహనానికి గురై.. చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Read also: మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా ?
” చిరంజీవి గారు.. దయచేసి మీరు ఫోటో సెషన్ ఆపి ఇటు పక్కకి రండి. లేకపోతే నాకు సెలవు ఇప్పించండి”. అన్నారు. గరికపాటి చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే మెగా అభిమానులే కాక నాగబాబుతో పాటు, రామ్ గోపాల్ వర్మ ఇలా తదితరులు గరికపాటి పై సోషల్ మీడియా వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు.
Advertisement
అయితే తాజాగా గరికపాటి వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో భాగంగా విలేకరులతో మాట్లాడిన చిరంజీవి.. ” గరికపాటి పెద్దాయన.. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు”. అని ఒక్క వ్యాక్యంతో వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. మరి చిరంజీవి స్పందనతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లు అవుతుందో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉంటే మరోసారి ఆచార్య ఫ్లాప్ పై చిరంజీవి స్పందించారు. ఆచార్య సినిమా ఫెయిల్ అయినందుకు తాను బాధపడడం లేదని చెప్పుకొచ్చారు.
ఆ సినిమాకి తీసుకున్న పారితోషికాన్ని తాను, రామ్ చరణ్ 80% వెనక్కి చేశామని తెలిపారు. బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా అప్డేట్ దీపావళి రోజు మోషన్ పోస్టర్, టైటిల్ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలోని డైలాగ్స్ అన్నీ తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉంటాయని తెలిపారు.
Read also: దీపావళికి విడుదల అవుతున్న తెలుగు సినిమాల లిస్ట్ ఇదే !