Advertisement
మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో హీరోలు కొడుకులు వారసులగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారు. ఆయన స్టామినా ఏంటో మనకి అర్థమవుతుంది. ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోగా చిరు నిలిచారు. సినిమాల్లో వచ్చిన క్రేజ్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే చాలామంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అవ్వడాన్ని చూసి కూడా రాజకీయాల్లోకి వచ్చారు.
Advertisement
2009 ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో పోటీ చేసినా ప్రజారాజ్యం కేవలం 18 సీట్లలో మాత్రమే విజయాన్ని సాధించగలిగింది. చిరంజీవి తాజాగా విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. దసరా పండుగ నాడు మెగా అభిమానులకి చిరంజీవి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. డిసెంబర్ టీజర్ ని శనివారం రిలీజ్ చేశారు.
Advertisement
Also read:
1.33 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఓ హీరో కారణంగా చిరు నిద్రలేని రాత్రులు గడిపారట. ఆయన ఎవరో కాదు కమల్ హాసన్. ఆయన నటించిన స్వాతిముత్యం అప్పట్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిందన్న విషయం మనకు తెలుసు. ఆ మూవీలో కమల్ హాసన్ అంత అద్భుతంగా ఎలా నటించారని తనకు తానే ప్రశ్నించుకుని ఆలోచనల్లో చిరుకి నిద్ర పట్టేది కాదట. స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!