Advertisement
Nara Lokesh: ఏపీ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జాతీయ స్థాయిలో ఈ విషయాలు చర్చనీయాంశంగా మారాయి. లోకేష్ హస్తిన కి వెళ్లారు అయితే ఇంకా ఏపీకి తిరిగి రాలేదు. రాజకీయంగా కేంద్ర పెద్దలను కలిసి ఈ విషయం గురించి చర్చిస్తున్నారా అనేది చూస్తే… ఇంతవరకు ఆయనకి బీజేపీ పెద్దలతో ఎలాంటి అపాయింట్మెంట్ కూడా దొరికినట్లు తెలియలేదు. జాతీయ మీడియా కూడా పెద్దగా చంద్రబాబు అరెస్టు గురించి పట్టించుకోలేదు. అయితే లోకేష్ ని అరెస్టు చేస్తారన్న భయంతోనే ఢిల్లీలో దాకున్నారని ఆంధ్రప్రదేశ్ అధికార పక్ష నేతలు, కార్యకర్తలు అంటున్నారు.
Advertisement
ఇదిలా ఉంటే వైసిపి సోషల్ మీడియా లోకేష్ ని ఒక రేంజ్ లో ఆడుకుంటోంది. విపరీతంగా
ట్రోల్ కూడా చేస్తోంది. అతను అరెస్ట్ అవుతానని భయం లేదని నిజంగా కేసులో సరైన సాక్షదారాలు ఉంటే ఢిల్లీకి వచ్చినా కూడా అరెస్ట్ చేసుకోవచ్చు కదా అని లోకేష్ కౌంటర్ ఇచ్చారు. మరి లోకేష్ ఎందుకు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు అనేది తెలీదు. తెలుగుదేశం పార్టీ నుండి దీని గురించి ఎలాంటి సమాధానం కూడా రాలేదు. ఇంతకీ లోకేష్ ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తే అక్కడ టిడిపి దగ్గర ఎలాంటి ఆన్సర్ కూడా లేదు.
Advertisement
ఒకపక్క చంద్రబాబునాయుడు అరెస్ట్ తో టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా దిగులు చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకి నిరసనలకి న్యాయకత్వం వహించాల్సిన లోకేష్ ఆ బాధ్యతల్ని తన భార్య బ్రహ్మణికి తల్లి భువనేశ్వరికి వదిలేసారు. పరిస్థితులు బాలేనప్పుడే సరిగ్గా వ్యవహరించాల్సి ఉంది. సిఐడి అధికారులు లోకేష్ కి 41 ఏ నోటీసులు ఇచ్చారు అక్టోబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకి తమ కార్యాలయంలో విచారణకి హాజర అవ్వాలని కోరారు. అలానే మంగళగిరిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు తో పాటుగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవులపై కూడా నోటీసు వచ్చినట్లు తెలుస్తోంది.
Also read: