Advertisement
రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఇటు టీడీపీ అటు వైసీపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ అధినేత, సీఎం జగన్ 98 % చిత్తశుద్ధితో అమలు చేశామని ప్రకటించారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మేనిఫెస్టో ని భారీ హామీలతో నింపేశారు. హామీలతో, సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కోటీశ్వరులను చేస్తామని, ఇప్పుడు ఉన్నవాటి కంటే రెట్టింపు పథకాలను అమలు చేస్తామని చెప్తూ వస్తున్నారు.
Advertisement
దీనిపై సీఎం జగన్ కూడా తనదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తున్నారని, ఆ హామీలను నెరవేర్చే ఉద్దేశ్యమే ఆయనకీ లేదని అందుకే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని హామీలను తీసుకొచ్చి జనం పై కురిపిస్తున్నారని జగన్ ఎద్దేవా చేసారు. చంద్రబాబు జీవితంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర లేదని ఆయన అన్నారు. తమ పార్టీ ఇచ్చే పథకాలతో ఏటా డెబ్భై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఎపి శ్రీలంక అవుతుందని బాబు ఎద్దేవా చేసారని గుర్తు చేసారు.
Advertisement
ఇప్పుడు ఆయన అంతకంటే ఎక్కువ పథకాలనే ఇస్తున్నారని.. ఈ హామీల విలువ లెక్కగడితే ఏటా 126 వేల కోట్ల రూపాయలు అవుతుందని సీఎం జగన్ లెక్కలు చెప్పారు. ఇంత ఖర్చు చేస్తే ఏపీ శ్రీలంక కన్నా ఏమి అవుతుందో చెప్పాలని సిఎం జగన్ డిమాండ్ చేసారు. బాబు సంపద సృష్టిస్తారు అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని.. కానీ ఇప్పటి వరకు బాబు ముఖ్యమంత్రిగా చేసినంత కాలం ఏపీ లోటు బడ్జెట్ తోనే కొనసాగిందని.. మళ్ళీ ఒక ఛాన్స్ అని ఎలా అడుగుతారని అన్నారు. తాను ప్రజల నమ్మకాన్ని గెల్చుకున్నానని, హామీ ఇచ్చిన పధకాలను అమలు చేసానని, కరోనా వచ్చినా పధకాలను ఆపలేదని అన్నారు.
Read More:
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. ఇక నుంచి లైన్ లో నిలబడాల్సిన అవసరమే లేదు!
ఎన్నికల వేళ విరాళాలను వెనక్కి ఇచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు !