Advertisement
ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల టాపికే నడుస్తోంది. రెండు రోజుల కిందట.. పవన్ కళ్యాణ్ విశాఖలో చేసిన హంగామా అలాగే, మంగళ గిరిలో చెప్పులు చూపించి.. వైసీపీ నేతలకు ఇచ్చిన వార్నింగ్ ఏపీ రాజకీయాలను వేడేక్కించింది. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అదే రీతిలో వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఏపీ సీఎం జగన్ కూడా.. పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేశాడు.
Advertisement
ఇవాళ ఆవనీగడ్డలో పర్యటించిన సీఎం జగన్.. బహిరంగ సభలో ప్రసంగించారు. బూతులు తిట్టడంలో విపక్ష నాయకులు ఏ స్థాయికి వెళ్ళారో చూస్తున్నామని.. టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తుంటే వీళ్ళా నాయకులు అని బాధేస్తుందని అన్నారు వైఎస్ జగన్. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏం మాట్లాడిస్తున్నాడో చూస్తున్నామని చురకలు అంటించారు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని మనం ఆలోచిస్తుంటే కొంత మంది మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. మీరూ చేసుకోండి అని చెబుతుంటే కంపర వేస్తుందని.. మూడేళ్లో, నాలుగేళ్ళు కలిసి ఉండి ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోండి అంటున్నారని పవన్ కు కౌంటర్ ఇచ్చారు.
Advertisement
వ్యవస్థ ఇలా ఉంటే ఇంట్లో ఆడవాళ్ళ మాన, ప్రాణాలు ఏం కావాలి?? కలిసి కూటములు కట్టి మన ప్రభుత్వం పై యుద్ధం చేస్తారంట వీళ్ళంత అంటూ ఆగ్రహించారు. ఒక్క జగన్ను కొట్టడానికి ఇంత మంది ఏకం అవుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుందని.. మంచి చేసే ప్రభుత్వానికి, పచ్చరంగు పెత్తందార్లకు మధ్య పోరాటం అన్నారు సీఎం జగన్. వచ్చే 18 నెలలు రోజూ ఇవే కనిపిస్తాయని.. ప్రజలంతా నాకు తోడుగా నిలబడతారని నాకు నమ్మకం ఉందని వెల్లడించారు. నేను దత్త పుత్రుడిని, మీడియాను నమ్ముకోలేదని.. మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధమని స్పష్టం చేశారు. సామాన్యుడికి, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధమని.. వచ్చే రోజుల్లో ఈ కుట్రలు, కుతంత్రాలు మరింత పెరుగుతాయని వెల్లడించారు. మీడియాని కాదు మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేదే ప్రామాణికంగా తీసుకోండని.. మీకు మంచి జరిగితే నాకు మద్దతుగా నిలబడండని కోరారు వైఎస్ జగన్.
READ ALSO : వైసీపీ నేతలను చెప్పులతో కొడతా – పవన్ కళ్యాణ్