Advertisement
ఏపీ రాజకీయాల్లో పెద్ద మలుపు చోటు చేసుకుంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మొత్తం రాజకీయ పరిస్థితులు కూడా మారాయి. ఎన్నికల రాజకీయం వేడెక్కి పోతోంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. బీజేపీ విషయంలో కూడా కొంచెం క్లారిటీ వచ్చేసింది. ఈ టైంలోనే పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ తో ప్లాన్ బి అమలకు సీఎం జగన్ రెడీ అయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రెండు రోజుల ఢిల్లీ పర్యటన పూర్తయింది.
Advertisement
తాడేపల్లి కి నేడు చేరుకోనున్నారు. జగన్ చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. టీడీపీ జనసేన పొత్తు ఖచ్చితమే. బీజేపీ కలిసి వస్తుందా రాదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో హోమ్ మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. ఏపీకి సంబంధించిన విషయాలని చర్చించారు. ఈనెల 9వ తేదీన విజయవాడలో సీఎం జగన్ ఎన్నికల సమరశంఖాన్ని పూరించనున్నారు.
Advertisement
ఎమ్మెల్యేలను, ఎంపీలని, కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ అలానే అనుబంధ సంఘాల నేతల్ని ఆహ్వానించారు. ఏపీకి జగన్ ఎందుకు అవసరం అనే దాని మీద చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అలానే జగన్ పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తో పాటుగా టీడీపీ జనసేన పొత్తుతో మారుతున్న రాజకీయ పరిస్థితులపై క్లియర్ గా ఉన్నారు సీఎం జగన్. టీడీపీ నేతలకి కౌంటర్ ఇచ్చేలా వున్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని టీడీపీ సపోర్ట్ చేస్తోంది. అందుకని జగన్ ప్లాన్ బి ని తీసుకురావడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also read: