Advertisement
ఓవైపు ఈడీ, ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలకు నిర్ణయించారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం విధిస్తున్న ఆంక్షలపై చర్చించేందుకు శాసనసభను సమావేశపరచాలని భావించారు. డిసెంబర్ లో వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని దానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు.
Advertisement
తెలంగాణపై కేంద్రం ఆంక్షల వల్ల ఈ ఏడాది రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో రూ.40వేల కోట్లు తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని టార్గెట్ చేసుకుంటూ కేసీఆర్ ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారని అర్థం అవుతోంది. ఇదే సమయంలో దర్యాప్తు సంస్థల దాడులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లపైనా విమర్శల దాడి చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మస్త్ ఇంట్రస్ట్ గా సాగుతున్నాయని అనుకుంటున్నారు.
Advertisement
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేంద్రంపై ఎలాంటి విమర్శలు చేస్తారు? దానికి బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్లుగా ఏదో ఒక అంశంతో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అంటూ పోటీపడి తిట్టుకుంటున్నాయి. విమర్శలు చేసుకుంటున్నాయి. గత సెషన్ లో ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆయన ఈసారి ఆచితూచి ప్రభుత్వంపై ఎటాక్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.
సెప్టెంబర్ లో సమావేశమైన ఉభయసభలు ఇప్పటి వరకు ప్రోరోగ్ కాలేదు. దీంతో గత సమావేశాలకు కొనసాగింపుగానే తాజా సమావేశాలు జరగనున్నాయి. అంటే.. ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం ఉండకపోవచ్చని సమాచారం. అలా జరిగితే మరో వివాదం కూడా కొనసాగే అవకాశం ఉంది. గత సెషన్ సమయంలో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై బీజేపీ ఎటాక్ చేసింది. తమిళిసై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.