Advertisement
CM KCR Rare unseen Photos:: తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రముఖుల పేర్లలో కెసిఆర్ ఒకటి. పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ అనంతరం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ సాధన కర్తగా, తెలంగాణ గాంధీగా ఆయన పిలవబడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఆయన జీవన ప్రస్థానం గురించి తెలుసుకుందాం.. చంద్రశేఖర్ రావు చింతమడకలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. కెసిఆర్ కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామంలో స్థిరపడింది.
Advertisement
Read also: DASARA MOVIE OTT RELEASE DATE: “దసరా” మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించారు. సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బిఏ పూర్తి చేసి.. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్ పూర్తి చేశారు. ఆయన భార్య శ్రీమతి శోభా కేసీఆర్. ఈ దంపతులకు ఒక కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత. ఆయన యూత్ లీడర్ గా కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన కేసీఆర్ 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ పట్ల అభిమానంతో కేసీఆర్ టిడిపి కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. కెసిఆర్ కు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం.
ఆయన మీద అభిమానంతో కల్వకుంట్ల తారక రామారావు అని ఆయన కొడుకుకి పేరు పెట్టుకున్నారు. ఇక 1987 – 88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించారు. 1999 – 2001 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ తర్వాత 2001 ఏప్రిల్ 21న తెలుగుదేశం పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో “తెలంగాణ రాష్ట్ర సమితి” పార్టీని ఏర్పాటు చేశారు. 2004 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తో కలిసి తన సొంత పార్టీ టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుండి గెలుపొందారు.
Read also: VENU SWAMY WIFE NAME: వేణు స్వామి భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?
2004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి పదవిని నిర్వర్తించారు. ఆ తర్వాత యూపీఏ నుండి బయటకు వచ్చారు. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికలలో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి మళ్ళీ విజయం సాధించారు. ఈ వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండవసారి పదవి బాధ్యతలు స్వీకరించిన వైయస్ ఆకస్మికంగా మృతి చెందడం, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు వంటి పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి పెంచారు.
Advertisement
ఇక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తప్పితే మరో మార్గం లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అలా నూతన రాష్ట్ర ఏర్పాటు జరగడం.. 2014 జూన్ 2న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి రైతు రాజ్యం కోసం పోరాడుతున్నారు. ఆయన రేర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కెయండి..
Read also: RAJINIKANTH WIFE LATHA LOVE STORY: రజినీకాంత్ జీవితం మారిపోవడానికి భార్య లతా చేసిన ఒక్క పని ఏంటంటే ?
1) కెసిఆర్ కాలేజీ రోజుల్లో
2) రాజకీయ స్నేహితులతో
3) బహిరంగ సభలో
4) కెసిఆర్ చిన్ననాటి ఫోటో
5) రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో
6) చంద్రబాబు నాయుడుతో
7) మనవడు, మనవరాలితో
8) భార్య, కొడుకు, కూతురుతో
9) వెంకటేష్, రానా, చంద్రబాబుతో కేసీఆర్
10) సోనియా గాంధీతో కేసీఆర్ ఫ్యామిలీ
11) కె విశ్వనాథ్ గారితో కెసిఆర్
12) విజయశాంతితో కెసిఆర్
13) తెలంగాణ ఉద్యమం సందర్భంలో
14) బండారు దత్తాత్రేయ అలయ్ బలాయ్ కార్యక్రమంలో
15) సిపిఐ, సిపిఎం నేతలతో