Advertisement
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈసారి మొత్తం 7 రోజుల్లో 56.25 గంటల పాటు సమావేశాలు కొనసాగాయి. ఈనెల 3న గర్నవర్ ప్రసంగంతో సమావేశాలు మొదలయ్యాయి. 6న ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభ చర్చించింది. అలాగే పలు బిల్లులు, తీర్మానాలపై చర్చ సాగింది. సమావేశాలు చివరి రోజైన ఆదివారం ఆర్థికమంత్రి హరీష్ రావు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు.
Advertisement
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో వార్షిక వృద్ధి రేటు 6.8 ఉంటే.. మోడీ వచ్చాక 5.8కి పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో వృద్ధిరేటు 24 శాతం ఎక్కువ అని తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.7 ఉండగా, మోడీ పాలనలో 7.1 ఉందని తెలిపారు. అంటే సగానికి సగం పడిపోయిందని విమర్శించారు.
Advertisement
ప్రధాని మోడీకి ఓట్లు కావాలంటే బియ్యం ఫ్రీ అంటారని, మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిందని అన్నారు కేసీఆర్. తాను చెప్పిన లెక్కలన్నీ వాస్తవాలని.. ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తానని తెలిపారు. తన మాటకు కట్టుబడి ఉంటానని, అభివృద్ధిపై మాట్లాడే హక్కు మోడీకి లేదన్నారు. దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోడీయే అని విమర్శించారు కేసీఆర్.
పారిశ్రామిక వృద్ధిరేటు మన్మోహన్ సింగ్ పాలనలో 5.87 శాతం ఉంటే.. మోడీ పాలనలో 3.2శాతం ఉందన్నారు. అదానీ ఆస్తులు పెరిగినట్టు ఏ రంగంలో వృద్ధి రేటు పెరిగిందని ప్రశ్నించారు. మోడీ పాలనలో డాలర్ తో పోలిస్తే రూపాయి పతనమైందన్న సీఎం.. మన్మోహన్, మోదీ పాలనతో పోల్చితే 26శాతం పడిపోయిందని వివరించారు. ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ చేయలేదు.. మోడీ పాలనలో ఇంకా ఘోరంగా ఉందని ఆర్థికవేత్త ఓ పుస్తకంలో రాశారని తెలిపారు.
దేశంలో ఏ ప్రధాని రైలును ప్రారంభించలేదని.. మోడీ ఎన్నిసార్లు వందేభారత్ రైలును ప్రారంభిస్తారని సెటైర్లు వేశారు. ఇప్పటికే 14సార్లు ప్రారంభించారన్నారు. ఇంతకన్నా ఘోరం ఉంటదా? వందేభారత్ కన్నా గొప్పగా ఎన్నో రైళ్లు నడుస్తున్నయని చెప్పారు కేసీఆర్. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి మోడీ శంకుస్థాపన చేస్తారా? కేంద్రమంత్రి వచ్చి లిఫ్ట్ లను జాతికి అంకితం చేస్తారా? ఇదానే దేశం నడిపే పద్ధతి అని మండిపడ్డారు. అంతర్జాతీయంగా అమెరికాలో గంటకు 95-115 కిలోమీటర్ల వేగంతో ట్రక్కు స్పీడ్ ఉంటే.. భారతదేశంలో 55 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయని వివరించారు కేసీఆర్.