Advertisement
టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులెవరూ ప్రలోభాలకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసర ఆశలకు పోయి లొంగి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎవరేం చేసినా తనకు సమాచారం అందుతుందన్న ఆయన.. ఓవైపు జాగ్రత్త అంటూనే ఇంకోవైపు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సమావేశం జరిగింది. పార్టీ నేతలంతా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.
Advertisement
పార్టీ మారాలంటూ తన కూతుర్ని కూడా అడిగారని.. ఇంతకంటే ఘోరం ఉంటుందా? అని మండిపడ్డారు. బీజేపీతో పోరాటం చేయాల్సిందేననని.. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్నికలకు మరో 10 నెలల సమయమే ఉందన్న సీఎం.. ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తేలేదన్నారు. మళ్లీ పాత వాళ్లకే టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు. బీజేపీ మరింతగా రెచ్చిపోతుందని.. పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దని.. ముఖ్యంగా వివాదాస్పద విషయాల్లో తలదూర్చొద్దని హెచ్చరించారు.
Advertisement
సమావేశంలో మునుగోడు ఫలితం పైనా సమీక్ష జరిపారు కేసీఆర్. మునుగోడులో మెజార్టీపై సీరియస్ అయ్యారు. సరిగ్గా పనిచేయని మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. కనీసం ఐదుగురు మంత్రులు ఇంఛార్జ్ లుగా ఉన్న ప్రాంతాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మెజార్టీ వచ్చింది. దీనిపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
ఇక ఎమ్మెల్యేల కోనుగోలు విషయంపై సుదీర్ఘ చర్చ జరిపారు కేసీఆర్. బీజేపీ నేతలను ప్రజా క్షేత్రంలో నిలదీయాలని టీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఒక నియోజకవర్గానికి ఒక్కరే ఇంచార్జ్ ఉండాలని.. జిల్లాల్లోని నేతలను మంత్రులే గెలిపించాలని స్పష్టం చేశారు. నియోజకవర్గ అబివృద్దిపై రిపోర్ట్ కార్డ్ రెడీ చేసుకోవాలన్నారు. కొంత మంది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని జాగ్రత్తగా ఉండాలని.. వారి విషయంలో కఠినంగా ఉంటానని చెప్పారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ 10 నెలలు కష్టపడాలని తేల్చిచెప్పారు కేసీఆర్.