Advertisement
నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన మొట్టమొదటి ఫుల్ లెన్త్ ఫీచర్ ఫిలిం కమిటీ కుర్రాళ్ళు తాజాగా విడుదలైన విషయం మనకి తెలిసిందే. యూత్ ఫుల్ కామెడీ డ్రామా మూవీ బానే మెప్పించింది కానీ ఇందులో చాలా మైనస్లు అయితే ఉన్నాయి. ఈ సినిమా ఒక జోనర్ అంటూ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. దర్శకుడు ఎదు వంశీ ఇందులో ప్రేమలు, ఊరి రాజకీయాలు, స్నేహాలు, రిజర్వేషన్లు ఇలా చాలా అంశాలని మిక్స్ చేశారు. ఏదో బిర్యాని చేసినట్లు మొదలవుతుంది. తర్వాత మాత్రం అవసరమైన అన్ని మిక్స్ చేసి గందరగోళం జానర్ గా మారిపోయింది. ఈ సన్నివేశాలని ఒక్కొక్కటిగా చూస్తే అన్ని బానే ఉంటాయి.
Advertisement
ఎదు వంశీ మెరుగైన డైరెక్షన్ స్కిల్స్ స్పష్టంగా కనిపించాయి. 90 లలో విలేజ్ బ్యాక్ డ్రాప్ తో నాస్ట్రాలజి సీన్స్ ను తీశారు. అవి అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. కానీ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి కథ ట్రాక్ అయితే మారిపోయింది. ఈ మూవీ ని ఎలా ముగించాలో డైరెక్టర్ కి తెలియదు అన్నట్లుగా మారిపోయింది. అందుకే దాన్ని అడ్డదిడ్డంగా తీశారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఆసక్తి కోల్పోయే విధంగా చేశారు. మొదటి భాగంలో ప్రతి ఊరిలో కనిపించే కల్మషం లేని కులమతాలకు అతీతమైన స్నేహాలు అలాగే ప్రేమ కథలు అన్నీ చూపించి ఆకట్టుకోగలిగారు.
Advertisement
Also read:
Also read:
ఇందులో ఉన్న 11 మంది హీరోలు కమిటీ కుర్రోళ్ళు వాళ్లే హీరోలు. ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. వారందరినీ పరిచయం చేయడానికి సినిమాలో చాలా టైం వేస్ట్ అయింది. మొత్తానికి ఈ సినిమా సినిమా కొంత మేరకు వరకు మెప్పించింది. సంగీతం, విలేజ్ సీన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!