Advertisement
రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం “కాంతారా” దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంటుంది. ఈ వారం ఇతర భాషలో డబ్బింగ్ అయినప్పటి నుండి, ఈ చిత్రం అపూర్వమైన ఆదరణను పొందుతుంది. అంతేకాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఎక్కడ ముగుస్తుందో ఊహించడం కూడా ట్రేడ్ పండితులకు చాలా కష్టంగా మారింది. రెండు ప్రధాన పాత్రల్లో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది.
Advertisement
కన్నడ వెర్షన్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్లను ఈ సినిమా నమోదు చేస్తుంది. మొదటి రోజు మంచి టాక్ తెచ్చుకున్న తర్వాత క్రమక్రమంగా ఈ చిత్రం అసాధారణమైన స్పందనను పెంచుకుంటూ కలెక్షన్లలో గణనీయమైన అభివృద్ధిని కనబరిచింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు రంగస్థలం సినిమాకు కొన్ని పోలికలు ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రంగస్థలం సినిమాలో ప్రెసిడెంట్ కు పోటీగా నిలబడ్డాడు అనే కారణంతో రామ్ చరణ్ తన అన్నను ప్రెసిడెంట్ చంపేశారు అని భావించి అతనిపై పగ తీర్చుకుందాం అనుకుంటాడు.
Advertisement
కానీ అసలు విలన్ ప్రకాష్ రాజ్ అని తెలిసి అతడిని హత మారుస్తాడు. అచ్చం అదేవిధంగా కాంతార సినిమా క్లైమాక్స్ ఉంది. కాంతార సినిమాలలో మొదట దొరకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి తన తమ్ముడిని చంపాడమే కోపంతో అతడిని చంపేందుకు సిద్ధమవుతాడు. కానీ చివరికి దొరే అసలు దొంగ అని తెలుసుకుని దేవుడు దేశంలో వచ్చి హతమారుస్తాడు. మరోవైపు రెండు సినిమాలను విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రియలిస్టిక్ గా తెరకెక్కించారు. కాగా ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలుగా నిలిచాయి. కాగా, “కాంతారా” ఐఎండీ రేటింగ్స్ లోనూ ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలను కూడా దాటేసిన సంగతి తెలిసిందే.
Read also: నయనతార దంపుతులు భలే ప్లాన్ చేసారు ..! సరోగసి కేసు నుంచి తప్పించుకునేందుకు …!