Advertisement
లక్ష్మీపార్వతి నందమూరి నారా కుటుంబం గురించి ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని చెబుతూ వార్తల్లో నిలుస్తుంది. అలాంటి లక్ష్మీపార్వతి తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. తారకరత్న మరణం గురించి ఆమె మాట్లాడుతూ.. తారక రత్న చాలా రోజుల క్రితమే మరణించాడని అన్నారు. వారి స్వార్థ రాజకీయాల కోసమే తారకరత్నను ఇన్ని రోజులు ఆస్పత్రిలో ఉంచారని లక్ష్మీపార్వతి తెలియజేశారు. ఆయన అకాల మరణం బాధాకరమైన విషయం అని అన్నారు. మా కుటుంబం విషయంలో చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయ విధానాన్ని అవలంబిస్తున్నారని చెప్పుకొచ్చారు.
Advertisement
నారా లోకేష్ పాదయాత్రకు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో తారకరత్న మరణానికి సంబంధించిన విషయాన్ని దాచిపెట్టారని లక్ష్మీపార్వతి తెలియజేశారు. పాదయాత్రను వాయిదా వేసిన టైం లోనే మరణ వార్తను ప్రకటించి ఉండాల్సిందని, తారకరత్న మరణాన్ని ప్రజలు అపశకునంగా భావిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ అపశకునం వ్యక్తులని ఆ విషయం రాష్ట్రానికి తెలుసని లక్ష్మీపార్వతి తెలియజేశారు. తారకరత్న తల్లిదండ్రులను భార్యాబిడ్డలను చంద్రబాబే ఇంతకాలం మానసిక వేదనకు గురి చేశారని చెప్పుకొచ్చారు. ఆయన నీచమైన రాజకీయాలు చేయడం మానేస్తే నందమూరి కుటుంబం బాగుంటుందని లక్ష్మీపార్వతి అన్నారు.
Advertisement
ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ తరుణంలో సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు.. ఆధారం లేకుండా లక్ష్మీపార్వతి ఇతర కామెంట్లు చేయడం సరికాదని కొంతమంది అంటుంటే, ఆ ఫ్యామిలీ బాధలో ఉన్న సమయంలో ఈ కామెంట్లు చేయడం ఏంటంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు. ఈ తరుణంలోనే మెదడు సంబంధిత సమస్యల వల్ల మృతి చెందారని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఆమె చేసిన కామెంట్స్ పై నారాయణ హృదయాలయ ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. ఆమెపై కేసు కూడా వేయడానికి సిద్ధపడ్డట్టు సమాచారం.
also read: