Advertisement
ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు అప్పట్లో రాజకీయాలతో సినిమాలతో కూడా ఆయన పాపులర్ అయిపోయారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ప్రజల కోసం ఎంతో సేవ చేశారు కూడా. ఒకసారి ఎన్టీఆర్ గారు మొత్తం మూడు సీట్ల కోసం పోటీ చేస్తే మూడు చోట్ల కూడా గెలిచారు. కానీ ఒకసారి మాత్రం ఎన్టీఆర్ గారికి ఓటమి తప్పలేదు. ఎన్టీఆర్ ఒకే ఒకసారి ఎమ్మెల్యేగా ఒకచోట పోటీ చేయడం జరిగింది. ఆయనపై ఒక వ్యక్తి గెలిచారు ఆ వివరాలను ఇప్పుడే చూసేద్దాం. రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో పార్టీని స్టార్ట్ చేశారు.
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యానికి తెర దించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. తర్వాత మూడు దఫాలుగా ఏడు సంవత్సరాలు పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసారు ఎన్టీఆర్ ఒకసారి మాత్రం ఎన్టీఆర్ ఓడిపోక తప్పలేదు. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓడిపోయారు తెలంగాణలో కల్వకుర్తిలో పోటీ చేసే ఆయన ఓడిపోయారు ఎన్టీఆర్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది అందుకని ఇబ్బందులు ఎదురయ్యాయి కొన్ని కారణాల వలన కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఓడిపోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ కి పోటీగా నిలిచింది చిత్తరంజన్ దాస్. ఆయన అక్కడ గెలిచారు. ఆయనకు ఇప్పుడు 72 సంవత్సరాలు రాజకీయాల్లో కూడా ఈయన ఇంకా కొనసాగిస్తున్నారు.
Advertisement
విద్యార్థి దశ నుండి కూడా ఈయన రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు 1989 లో జరిగిన ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పై పోటీ చేసి ఆయనని ఓడించి జాయింట్ కిల్లర్‌గా తెలుగు రాజకీయాల్లో నిలిచారు. తర్వాత ఈయన మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత మళ్ళీ జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో ఈయన ఓడిపోయారు. 1999 లో టికెట్ ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు.
చిత్తరంజన్ దాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఓబిసి సెల్ చైర్మన్ గా పని చేశారు 2018లో కొల్లాపూర్ లేదా జడ్చర్ల నుండి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. సెప్టెంబర్ 30న హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!