Advertisement
లంక ప్రిమియర్ లీగ్ 2వ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక పాము మైదానంలోకి ప్రవేశించింది. కొలంబో ఆర్. ప్రేమదాస్ మైదానంలో గాలో టైటాన్స్ తో దంబుల్లా ఓర్రా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ 4వ ఓవర్ సమయంలో మైదానంలో పాము కనిపించడంతో మ్యాచ్ కొంత సేపు నిలిచిపోయింది. ఈ సమయంలో మైదానంలోకి వచ్చి ఫోర్త్ అంఫైర్ పామును బయటికి పంపించాడు. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
మైదానంలో పాము ఎంట్రీ ఇవ్వడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. అందరూ దూరం నుంచి పామును చూస్తున్నారు. కానీ దగ్గరికీ వెళ్లడానికి ఎవ్వరూ సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఫోర్త్ అంపైర్ ముందుకు వచ్చి.. ఆ పామును మైదానం నుంచి పంపించాడు. పాము మైదానం వెలుపలికి వెళ్లిన తరువాత మ్యాచ్ ని తిరిగి ప్రారంభించాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ముగిసిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది.
Advertisement
గాలె, దంబుల్లా మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలె 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. భానుక రాజపక్సె 48 పరుగులు చేయగా.. కెప్టెన్ ధసున్ షనక 42 పరుగులు చేసాడు. 21 బంతుల్లో షనక 4 సిక్సర్లు బాదాడు. దీంతో దంబుల్లా ఓర్రా 180 పరుగులు చేసింది. బౌలింగ్ లో షకన కూడా ముగ్గురు బ్యాట్స్ మెన్ ఔట్ చేశాడు. దీంతో సూపర్ ఓవర్ కు చేరుకుంది. కుషన్ రజతా పై దంబుల్లా కేవలం 9 పరుగులు చేశాడు. భానుక రాజపక్సే రెండు బంతుల్లో 10 పరుగులు చేసి టోర్నీలో విజయాన్ని అందించాడు.