Advertisement
2024 సార్వత్రిక ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమవుతున్నది. అందుకు చిరకాలంగా పలువురు నాయకులకు కలిసి వచ్చిన పాదయాత్ర విధానాన్ని ఎంచుకున్నట్లు స్పష్టం అవుతోంది. దేశంలో ప్రత్యేక పరిస్థితి నెలకొందని భావిస్తున్న బిజెపి ఇతర పార్టీలను ఒక్కతాటి మీదికి తెచ్చేందుకు రాహుల్ గాంధీ ఏకంగా మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్రకు ముందుకు వచ్చారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర పేరిట కాలినడక సాగించేందుకు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే, సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి రాహుల్ భారత్ జోడోయాత్ర ప్రారంభించారు.
Advertisement
ఇక ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని రాహుల్ గాంధీ జోడో యాత్ర ఎంట్రీ ఇచ్చింది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణా మండలం గూడబల్లూరు దగ్గర తెలంగాణలోకి ప్రవేశించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు శ్రీధర్ బాబు సహా పలువురు టీ కాంగ్రెస్ నేతలు. టై రోడ్ వరకు 3 కిలోమీటర్ల పాటు పాదయాత్ర కొనసాగనుంది. మహబూబ్ నగర్-రాయచూరు మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. భారత్ జోడోయాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు. దేశ సమైక్యత కోసమే భారత్ జోడోయాత్ర చేపట్టామని పేర్కొన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బిజెపి, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ.
Advertisement
అయితే తెలంగాణలో తొలిరోజు పాదయాత్ర ముగిసిన తర్వాత రాహుల్ సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్నారు. దీపావళి పండుగ సందర్భంగా 24,25,26 వ తేదీల్లో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి 27వ తేదీ నుంచి తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది. తెలంగాణలో మొత్తం 13 రోజులపాటు 375 కిలోమీటర్ల మేర రాహుల్ నడవనున్నారు. నవంబర్ 7 వరకు రాష్ట్రంలో రాహుల్ జోడో యాత్ర కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మక్తల్ నుంచి హైదరాబాద్ మీదుగా మద్నూర్ వరకు రాహుల్ పాదయాత్ర చేసేందుకు టీ కాంగ్రెస్ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
READ ALSO : మరోసారి జగన్ సీఎం కాకపోతే.. గెలిచినా రాజీనామా చేస్తా !