Advertisement
ఢిల్లీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ తర్వాత రాష్ట్రంలో పలువురు కాంగ్రెస్ నేతలు స్పందించారు. కొందరైతే తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఓసారి ఎవరెవరు ఏమన్నారో చూద్దాం.
Advertisement
మాణిక్ రావు థాక్రే, కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్
కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ కలిసే ఉద్దేశం లేదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం.వరంగల్ బహిరంగ సభలో రాహుల్ చెప్పిన మాటలకే పార్టీ కట్టుబడి ఉంది. కోమటిరెడ్డి ఏం మాట్లాడారో నేను ఇంకా చూడలేదు. వ్యాఖ్యలు చేసిన వీడియోలు చూసి.. ఆ తర్వాత ఈ విషయంపై మాట్లాడతాను.
మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కానీ, తర్వాత కానీ.. ఎవరితో పొత్తు పెట్టుకోదు. ఆ అవసరం కాంగ్రెస్ పార్టీకి రాదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తోనే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీ ఉంది. కార్యకర్తలు గందరగోళంలో పడే విధంగా నాయకులు మాట్లాడటం సరికాదు. సీనియర్ నాయకులు బీఆర్ఎస్.. కాంగ్రెస్ తో కలిసి పని చేస్తుందని మాట్లాడడం సరైంది కాదు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ లక్ష్యంతో అయితే ఇచ్చామో ఆ లక్ష్యం నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది.
జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుకు సిద్ధంగా లేదు. తెలంగాణలో ఎన్నికల్లో పొత్తుల విషయమై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన మాటలే ఫైనల్. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. మా పార్టీతో పొత్తుకు బీఆర్ఎస్ కూడా ఆలోచన చేయదు. 2023 ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ కూడా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు.
Advertisement
వీ హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత
ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం మంచిదేనా? తప్పులుంటే సరిదిద్దుకుని ముందుకెళ్లాలి. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఎంపీగా గెలిచి ఇలా మాట్లాడడం సరికాదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుంటే కార్యకర్తలు కన్య్ఫూజ్ అవుతున్నారు. జోతిష్యం చెప్పడం ఎవరికి అవసరం లేదు. కింది స్థాయిలో కార్యకర్తలు కొట్లాడుతుంటే.. పైన మనం కొట్లాడుతుంటే ఎలా?
అద్దంకి దయాకర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
కోమటిరెడ్డి పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ ను బలహీనపర్చేందుకు కాకుండా బలోపేతానికి నేతలు ప్రయత్నిస్తే బాగుంటుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. వెంకట్ రెడ్డి ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంది. కాంగ్రెస్ క్యాడర్ మనోధైర్యం దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకోవాలి. గతంలో వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది.
బల్మూరి వెంకట్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు
కోమటిరెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం. మాణిక్ రావు థాక్రే.. ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు.