Advertisement
ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజాపాలన కావాలా అంటూ ట్విట్టర్ పోస్ట్ పెట్టి.. దానికి వచ్చిన వ్యతిరేక స్పందనతో నవ్వుల పాలైంది ఇటీవల కాంగ్రెస్ సోషల్ మీడియా. అయినా సరే ఆ పార్టీ ఇంకా మారినట్టు కనిపించడం లేదు. తప్పులు చేయడం, ఆపై అడ్డంగా దొరికిపోవడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.
Advertisement
బీఆర్ఎస్ కు కౌంటర్లు ఇచ్చేందుకు అస్త్రాలు ఉన్నా..వాటిని మిస్సైల్ లా పేల్చలేకపోతుంది. పైగా..బీఆర్ఎస్ కు లేని ఆయుధాలు అప్పనంగా అప్పగించేస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గెలుస్తాడని ఓ ప్రధాన సర్వే సంస్థ తేల్చిందని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం. ఆ ట్వీట్ వైరల్ కావడం..సర్వే సంస్థను వివరణ కోరితే.. అబ్బే తమకు తెలియదని సమాధానం ఇవ్వడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా మళ్లీ ఘాటుగా వాయించేస్తుంది.
Advertisement
ఇప్పటివరకు చేసిన వాటిని, ఉన్నవాటిని ప్రచారం చేసుకుంటే కాంగ్రెస్ కు మైలేజ్ వస్తుంది. కానీ, లేనివాటి కోసం ఎందుకు ఆరాట పడుతున్నారో ఆ సోషల్ మీడియా విభాగం అధిపతులకే తెలుసు. అయితే, వరుసగా జరుగుతోన్న పరిణామాలను గమనిస్తుంటే..కాంగ్రెస్ సోషల్ మీడియాలో కట్టప్పలు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్నికల సమయంలో ఇలాంటి ఫేక్ ప్రచారం ప్రత్యర్థులకు లేని అవకాశం అందివ్వడమే. ఇది ఎందుకు గుర్తించడం లేదు.. కారణం కట్టప్పలే అంటున్నారు..ఏమో.. కొట్టిపారేయలేం..