Advertisement
ఒకప్పుడంటే.. పోస్టర్లు అంటించడం, ఫ్లెక్సీలు కట్టడం, గోడల మీద ప్రచారం చేయడం జరిగేవి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియా ప్రభావం గట్టిగా ఉంది. ఒకర్ని గొప్ప లీడర్ గా ప్రమోట్ చేయాలన్నా.. వరస్ట్ లీడర్ గా జనం ముందు ఉంచాలన్నా సోషల్ మీడియానే అస్త్రంగా వాడుతున్నారు. పార్టీలు సైతం ప్రత్యేక టీములను ఏర్పాటు చేసుకుని సోషల్ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే.. ఒక్కోసారి చిక్కులు తప్పడం లేదు.
Advertisement
ఎదుటి పార్టీని విమర్శించాలన్న క్రియేటివిటీ కాస్త హద్దలు దాటుతోంది. దానివల్లే కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు అదే పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా తెలంగాణ గళం పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ సునీల్ కనుగోలుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా సోమవారం రెండు గంటల పాటు సునీల్ కనుగోలును పోలీసులు విచారించారు.
Advertisement
స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు ఖాకీలు. తెలంగాణ గళం పేరుతో ఫేస్ బుక్ లో దుష్ప్రచారం చేస్తున్నారనే అభియోగాలపై ప్రశ్నలు వేశారు. కొద్ది రోజులక్రితం కాంగ్రెస్ వార్ రూంపై పోలీసులు దాడి చేసి కంప్యూటర్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సునీల్ కనుగోలు సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. తన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో గత నెలలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పింది న్యాయస్థానం.
మరోవైపు ఇదే కేసులో కాంగ్రెస్ నేత మల్లు రవికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 12న విచారణకు హాజరు కావాలంటూ సీఆర్సీపీసీ 41 కింద నోటీసులు పంపారు. సునీల్ కనుగోలుకు ఇటీవల నోటీసులు ఇచ్చిన తర్వాత మల్లు రవి స్పందిస్తూ.. సునీల్ కి ఇవ్వడం ఏంటి? ఆయనకేం సంబంధం అంటూ ప్రశ్నించారు. వార్ రూంకి తానే ఇంచార్జ్ అని.. అప్పుడు తనకే ఇవ్వాలిగా అని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే మల్లు రవికి పోలీసులు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.