Advertisement
తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రానే వచ్చేసింది. ఎన్నికలకు ముందు రాజకీయ వేడి రగిలిపోయింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు బీజేపీ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాటల యుద్ధంతో పాటు కొన్ని చోట్ల రక్తాలు కారేలా కొట్టుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి.ఈ రాజకీయ పరిణామాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10309 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
Advertisement
వాస్తవానికి బీజేపీ మొదటి మూడు రౌండ్లలో ఆధిక్యత కనబరిచినప్పటికీ ఫైనల్ గా అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై పలు సర్వే సంస్థలు తమ అంచనాలు వేశాయి.వాటన్నింటిలో 95 శాతం టీఆర్ఎస్ గెలుస్తుందని “COPACT” సర్వే సంస్థ మాత్రమే చెప్పడం విశేషం. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో “COPACT” సంస్థ రెండు సార్లు తనదైన శైలిలో సర్వే నిర్వహించింది. మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలలో, అన్ని గ్రామాల్లో దాదాపు 3000 మంది నుంచి సమాచారం సేకరించింది.
Advertisement
ఎన్నికలకు 15 రోజుల ముందు ఒక సర్వే, ఎన్నికలకు నాలుగు రోజుల ముందు మరో సర్వే చేపట్టింది “COPACT” సంస్థ. టీఆర్ఎస్ కి 41 శాతం ఓట్లు వస్తాయని, బీజేపీ కి 36 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. “COPACT” సర్వే ప్రకారం.. టీఆర్ఎస్ కి 42 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా “COPACT” సర్వే ప్రకారమే ఫలితాలు వచ్చాయి. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా “COPACT” సంస్థ చేసిన సర్వే అనుకున్న ఫలితం అందించింది. ముందు ముందు కూడా ఇలాంటి వాస్తవమైన సర్వేలు అందించాలని ఆశీద్దాం