Advertisement
2020లో తగులుకున్న కరోనా మహమ్మారి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. కేసులు తగ్గడం.. కొన్నాళ్లకు పెరగడం కామన్ అయిపోయింది. ఇప్పటికే ఎన్నో లక్షల కుటుంబాల్లో విషాదాన్నినింపిన ఈ మహమ్మారి.. మరోసారి విజృంభించేందుకు కాలు దువ్వుతోంది. గత కొన్నాళ్లుగా నమోదవుతున్న కేసులే అందుకు నిదర్శనం. రోజురోజుకీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుందే గానీ.. తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
Advertisement
గత మూడు రోజుల్లో వరుసగా పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 15 రోజుల క్రితం వరకు వందల్లో ఉన్న రోజువారీ కేసుల సంఖ్య ఇప్పుడు పది వేలకు పైగా దాటిందంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం చూస్తే.. దేశంలో కొత్తగా 10,753 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలు దాటింది.
Advertisement
శుక్రవారం అయితే.. ఏకంగా 11,109 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన ఏడు నెలల్లో ఇదే అత్యధికం. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ బీబీ.1.16 వల్ల కేసులు నమోదవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 4.49శాతానికి చేరుకుంది. కొత్తగా దేశంలో 27 మంది మరణించగా.. ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,31,091కు పెరిగింది.
ప్రస్తుతం ఇంటర్, టెన్త్ పరీక్షలు అయిపోయాయి. మిగిలిన విద్యార్థులకు కూడా రేపో మాపో సెలవులు ఇస్తారు. దీంతో జనం రాకపోకలు తగ్గే అవకాశం ఉంటుందని.. కరోనా తగ్గుముఖం పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.