Advertisement
చెన్నైలోని ముగలి వాక్కానికి చెందిన రామ్ బాలాజీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. భార్యతో గొడవల కారణంగా విడిపోయి వేరుగా ఉంటున్నాడు. తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో భాగంగా 2018లో మధురై వెళ్ళాడు. అక్కడ అతడికి విద్యాశ్రీతో పరిచయం ఏర్పడింది. ఆమెకు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే విద్యాశ్రీ, రామ్ బాలాజీని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది. దీంతో అతడికి ఆమెపై నమ్మకం కలిగింది. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని ఆమె కోసం బాగా డబ్బులు ఖర్చు చేయసాగాడు.
Advertisement
READ ALSO : 12 ఇయర్స్, కపుల్ చాలెంజ్! అలా మొదలైంది మా ప్రేమ కథ!
ఆమె తన పిల్లల కోసమని, ఇతర అవసరాల కోసమని బాలాజీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంది. దాదాపు ఆమెకోసం రూ.50 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. రోజులు గడిచే కొద్ది విద్యాశ్రీలో మార్పు రాసాగింది. రామ్ బాలాజీని దూరం పెడుతూ వచ్చింది. తాను ఓ వ్యక్తితో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నానని, తనను ఇబ్బంది పెట్టవద్దని రామ్ బాలాజీ ఫోన్ చేసినప్పుడు ఆమె తెలిపింది. దీంతో తాను ఖర్చుపెట్టిన డబ్బుల్ని తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా రామ్ బాలాజీ ఆమెను డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వడానికి ఆమె ఒప్పుకుంది. అయితే చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వలేదు.
Advertisement
READ ALSO : ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?
దీంతో రామ్ బాలాజీ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యాశ్రీ తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. వారిని విచారించగా తన తండ్రికి చెందిన స్థలాన్ని అమ్మి డబ్బులు ఇస్తానని ఆమె చెప్పింది. ఇందుకు ఐదు నెలల సమయం కోరింది. ఐదు నెలల తర్వాత రామ్ బాలాజీ ఆమెను కలిశాడు. అయితే ఆమె డబ్బులు ఇవ్వకపోగా అతడిని బెదిరించింది. రామ్ బాలాజీ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పట్టించుకోలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాడు. కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
READ ALSO : కల్యాణ్ దేవ్ సంచలన పోస్ట్.. ఆ తప్పులు అంటూ !